Published On:

Indonesia: పడవ ప్రమాదంలో 65 మంది పర్యాటకులు గల్లంతు

Indonesia: పడవ ప్రమాదంలో 65 మంది పర్యాటకులు గల్లంతు

Boat Accident: ఇండోనేషియాలోని బాలిలో పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. తూర్పు జావాలోని కేతాపాంగ్ ఓడరేవు నుంచి బయలుదేరిన తును ప్రతమ జయ అనే ఫెర్రీ30 తర్వాత మునిగిపోయింది. ప్రసిద్ధ రిసార్ట్ ద్వీపం బాలి సమీపంలో పడవ బోల్తా పడగా 65 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం అధికారులు సహాయక చర్యలు మొదలు పెట్టారు. జావాకు చెందిన ఫెర్రీ మానిఫెస్ట్ డేటా ప్రకారం పడవలో మొత్తం 53 మంది పర్యాటకులు, 12 మంది ఉన్నట్టు సమాచారం. 14 ట్రక్కులు, 22 వాహనాలను రవాణా చేస్తున్నారని తెలిసింది.

స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.20 గంటలకు బాలి జలసంధిలో ఫెర్రీ మునిగిపోయిందని సురబయ రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది. ప్రమాదంలో ఇప్పటివరకు రెండు మృతదేహాలు వెలికితీశామని, 20 మందిని రక్షించామని, వారిలో చాలా మంది అపస్మారక స్థితిలో ఉన్నట్టు బన్యువాంగి పోలీస్ చీఫ్ రామ సమతామ పుత్ర తెలిపారు. టగ్ బోట్లు, తొమ్మిది పడవలతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి: