Published On:

Congress: అధికారంలోకి వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ను బ్యాన్‌ చేస్తాం: ప్రియాంక్‌ ఖర్గే

Congress: అధికారంలోకి వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ను బ్యాన్‌ చేస్తాం: ప్రియాంక్‌ ఖర్గే

Karnataka Minister Priyank Kharge: కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ను పూర్తిగా బ్యాన్‌ చేస్తామని కర్ణాటక మంత్రి ప్రియంక్‌ ఖర్గే అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ విద్వేషాలను రెచ్చగొట్టడంతోపాటు రాజ్యాంగానికి లోబడి పనిచేయడం లేదని ఆరోపించారు. ఒక వేళ తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తామని స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ నిషేధించలేదా..? మళ్లీ అదే చేశారని తెలిపారు. వారు కేవలం చట్టాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తారని చెప్పారు. వారి వద్దకు వచ్చిన రూ.250 కోట్ల ఫండ్స్‌ ఎక్కడివని ప్రశ్నించారు. వీటిపై కచ్చితంగా దర్యాప్తు చేయాలన్నారు. చట్ట సభ సభ్యుల పని ఏమిటీ అన్నారు. శాసనాలు చేయడం, అవసరమైన చట్టాలను తాము తెస్తామన్నారు. కానీ, రాజ్యాంగానికి అతీతంగా ప్రవర్తించం అని వ్యాఖ్యానించారు.

 

జూన్‌ 27వ తేదీన ప్రియాంక్‌ ఆర్‌ఎస్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాడు ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఉప్పు సత్యాగ్రహ, క్విట్‌ ఇండియా ఉద్యమాలు లేదా మరే ఇతర ఆందోళనల్లో పాల్గొనలేదన్నారు. ఆర్‌ఎస్ఎస్‌ రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని వ్యతిరేకిస్తుందని, బీజేపీ దాని కీలు బొమ్మలా పనిచేస్తోందని ప్రియాంక్‌ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: