Published On:

Mallikarjun Kharge: హైకమాండ్‌ చేతిలో ఉంది.. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఖర్గే

Mallikarjun Kharge: హైకమాండ్‌ చేతిలో ఉంది.. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఖర్గే

Congress National President Mallikarjun Kharge: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగనుందని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌కు ముఖ్యమంత్రి పగ్గాలు కట్టబెట్టబోతున్నారని చర్చ జరుగుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. బెంగళూరులో మీడియా అంశంపై ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెప్పారు.

 

సీఎం మార్పు అంశం పార్టీ హైకమాండ్ చేతిలో ఉందన్నారు. పార్టీ హైకమాండ్‌లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఏ ఒక్కరూ బయటకు చెప్పరన్నారు. ఈ విషయంలో చర్య తీసుకునే హక్కు హైకమాండ్‌కు ఉందన్నారు. విషయాన్ని హైకమాండ్‌కే వదిలేద్దామని చెప్పారు. దీనిపై ఎవరూ అనవసరమైన సమస్యలు సృష్టించొద్దని కోరారు. కర్ణాటకలో సీఎం మార్పు వార్తలు నిజమేనా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఖర్గే పైవిధంగా స్పందించారు.

 

డీకే శివకుమార్‌ కర్ణాటక ముఖ్యమంత్రి కాబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం అదే విషయం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరో రెండుమూడు నెలల్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కర్ణాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని హుస్సేన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరు కృషిచేశారో అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం హైకమాండ్‌ శివకుమార్‌ గురించే యోచిస్తోందన్నారు. డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి: