West Indies Tour: వెస్టిండీస్ టూర్‌కు టెస్ట్, వన్డే జట్లను ప్రకటించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం వెస్టిండీస్ పర్యటన కోసం టెస్ట్ మరియు వన్డే జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాట్స్ మెన్ ఛతేశ్వర్ పుజారా మరియు పేసర్ ఉమేష్ యాదవ్ లకు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు.

West Indies Tour: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం వెస్టిండీస్ పర్యటన కోసం టెస్ట్ మరియు వన్డే జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాట్స్ మెన్ ఛతేశ్వర్ పుజారా మరియు పేసర్ ఉమేష్ యాదవ్ లకు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు.
టెస్ట్, వన్డే జట్ల సభ్యులు వీరే..(West Indies Tour)
వెస్టిండీస్ పర్యటనకు భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్ ),శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికె), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
వెస్టిండీస్ వన్డేలకు టీం ఇండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్). శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్), శార్దూల్ ఠాకూర్, ఆర్ జడేజా , అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.
జూలై 12 నుంచి భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ టూర్ ప్రారంభమవుతుంది. భారత్ వెస్టిండీస్‌తో 3 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ-20లు ఆడుతుంది. ప్రస్తుతం టెస్ట్, వన్డే జట్లను ప్రకటించిన బీసీసీఐ టీ-20 జట్టును త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- Janasena chief Pawan Kalyan: ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుని అందరినీ నాశనం చేసారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్
- Fisherman: 11 గంటలు సమద్రంలో ఈతకొట్టి ఒడ్డుకు చేరిన మృత్యుంజయుడు.. ఈ మత్స్యకారుడు..