Last Updated:

Mama Mascheendra Movie Review : సుధీర్ బాబు “మామా మశ్చీంద్ర” మూవీ రివ్యూ, రేటింగ్ ఎలా ఉందంటే ?

Mama Mascheendra Movie Review : సుధీర్ బాబు “మామా మశ్చీంద్ర” మూవీ రివ్యూ, రేటింగ్ ఎలా ఉందంటే ?

Cast & Crew

  • సుధీర్ బాబు (Hero)
  • ఈషా రెబ్బా, మృణాళిని రవి (Heroine)
  • హర్షవర్ధన్, 'మిర్చి' కిరణ్, అజయ్, రాజీవ్ కనకాల, హరితేజ, 'షకలక' శంకర్, అలీ రేజా తదితరులు (Cast)
  • హర్షవర్ధన్ (Director)
  • సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు (Producer)
  • చైతన్ భరద్వాజ్, ప్రవీణ్ లక్కరాజు (Music)
  • పీజీ విందా (Cinematography)
2.5

Mama Mascheendra Movie Review : ప్రముఖ హీరో సుధీర్ బాబు గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన పాత్రలు చేసి నటుడిగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్ బాబు. ప్రముఖ నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్‌ హీరోగా చేసిన మూవీ “మామ మశ్చీంద్ర”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి నారాయణ దాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, టైలర్ మూవీపై అంచనాలను క్రియేట్ చేయడంతో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాలి. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా నేడు ఈ  సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సుధీర్ బాబు ఈ చిత్రంతో అయినా హిట్ కొట్టాడా..? లేదా ?? మూవీ రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా

సినిమా కథ..

పరుశురాం(సుధీర్ బాబు) చిన్నప్పుడే వాళ్ళ నాన్న వేరే అమ్మాయి కోసం, ఆస్తి కోసం తన అమ్మని చంపేయడంతో నాన్నని, ఆ అమ్మాయిని చంపి విలన్ గా మారతాడు. జైలుకి వెళ్లొచ్చి కేవలం డబ్బులే జీవితం అన్నట్టు మామ ఆస్తి కోసం ట్రై చేస్తాడు. తనకి పాప పుట్టాక భార్య, మామ అనుకోకుండా చనిపోవడంతో ఆస్తి కోసం తన కింద పనిచేసే రామదాసుతో మామ పిల్లలని, మనవళ్ళని కూడా చంపమని చెప్తాడు. చివరి నిమిషంలో వాళ్ళు మిస్ అవుతారు. రామదాసు మీద కోపంతో అప్పుడే ఇద్దరికి పాప పుట్టడంతో ఆ పాపలని మార్చేసి ఇద్దర్ని సొంత కూతుర్లులా చూసుకుంటాను అంటాడు. కట్ చేస్తే.. కొన్నేళ్ళకు పరశురామ్ కుమార్తె విశాలాక్షి (ఈషా రెబ్బా), విశాఖలో రౌడీ దుర్గ (సుధీర్ బాబు) ప్రేమలో పడతారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన దాసు కుమార్తె మీనాక్షి (మృణాళిని రవి), ఫేమస్ డీజే (సుధీర్ బాబు) ప్రేమలో పడతారు. ఈ విషయం తెలిసి… తన పోలికలతో జన్మించిన మేనల్లుళ్లు పగ తీర్చుకోవాలని ఇలా ప్రేమ పేరుతో కొత్త నాటకానికి తెర తీశారేమోనని పరశురామ్ అనుమానిస్తాడు. అది నిజమా? లేదంటే అతడి ఊహ మాత్రమేనా? పరశురామ్ మీద హత్యాయత్నం చేసింది ఎవరు? కుమార్తెల విషయంలో పరశురామ్, దాసు ఒకరి దగ్గర మరొకరు దాచిన నిజం ఏమిటి? చివరకు ఏమైంది అనేది తెరపై చూసి తెలుసుకోక తప్పదు..

మూవీ విశ్లేషణ (Mama Mascheendra Movie Review).. 

మనం, ‘గుండెజారి గల్లతయ్యిందే’, ‘చిన్నదాన నీ కోసం’ సినిమాలతో రచయితగా హర్షవర్ధన్.. ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నారు. ఆ నమ్మకం తోనే సుధీర్ బాబు ఈ మూవీ ఓకే చేసి ఉంటారని అనుకోవచ్చు. ఇక ఏఎ సినిమా విషయానికి వస్తే స్వీట్ బావుందని ఎక్కువ తింటే షుగర్ వస్తుంది. అలాగే… ట్విస్టులు బావుంటాయని మరీ ఎక్కువ అయినా కూడా ప్రేక్షకులు గందరగోళానికి గురి అయ్యే ఛాన్స్ ఉంది. ‘మామా మశ్చీంద్ర’ విషయంలో కొంచెం ఈ  విషయమే ఎక్కడో తేడా కొట్టిందేమో అనిపిస్తుంది. ఒక షాక్ తర్వాత మరొక షాక్ అంటే కథను అర్థం చేసుకోవడానికి కష్టమే అవుతుంది.

హీరోని మూడు నాలుగు లుక్కుల్లో చూపించడమే కాకుండా.. ట్విస్టులు మీద ట్విస్టులు ఇస్తూ పోయారు. కానీ కథను ఆసక్తికరంగా ముందు తీసుకు వెళ్లడంలో కొంచెం ఫెయిల్ అయ్యారు. లడ్డు బాబు లాంటి హీరో వెంట హీరోయిన్ ఎందుకు పడింది? పతాక సన్నివేశాల్లో హీరోలో మార్పు ఎందుకు వచ్చింది? సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొన్ని సీన్లు రాసుకుంటూ వెళ్లారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సాధారణ ప్రేక్షకులకు అక్కడక్కడా కన్ఫ్యూజన్ రాక తప్పదు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఉండే ట్విస్ట్ లు బాగుంటాయి. అక్కడక్కడా కొంచెం కామెడీ వర్కౌట్ అయింది. మేనల్లుళ్ళ మీద అంత బలమైన పగ ఎందుకు? వంటివి కన్వీన్సింగ్‌గా చెప్పలేదనే డౌట్ కొంచెం అనిపిస్తుంది.

Maama Mascheendra Movie Review

నటీనటులు ఎలా చేశారంటే.. 

సుధీర్ బాబు మూడు పాత్రలు చేశారు. రెగ్యులర్ లుక్కులో బాగున్నారు. ఎప్పటిలా ప్యాక్డ్ బాడీ చూపించారు. లడ్డు బాబు మేకప్ గానీ, ఆ లుక్ గానీ ఆయనకు సెట్ కాలేదు. ముసలి గెటప్ కూడా! పైగా… సుధీర్ బాబుతో కాకుండా వేరొకరితో ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పించడం కూడా బాలేదు. సినిమాలో సుధీర్ బాబు అన్‌కంఫర్టబుల్‌గా కనిపించారు. ఈషా రెబ్బా, మృణాళిని రవి… హీరోయిన్లు ఇద్దరి పాత్రలు రొటీన్! ఆయా పాత్రల్లో వాళ్ళ నటన కూడా! దర్శక, రచయితగా కంటే నటుడిగా హర్షవర్ధన్ మెప్పించారు. క్యారెక్టర్స్ డిజైన్ కారణంగా రాజీవ్ కనకాల, ‘మిర్చి’ కిరణ్, హరితేజ, అజయ్ తమ పరిధి మేరకు నటించారు. రామ్ గోపాల్ వర్మగా ‘షకలక’ శంకర్ కనిపించారు. పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా లేవు. పీజీ విందా ఇంతకు ముందు లో బడ్జెట్ సినిమాలు చేసినా కెమెరా వర్క్ భారీ బడ్జెట్ ఫిల్మ్ అన్నట్టు ఉండేది. కానీ, ఈ సినిమాలో ఆ ఫీల్ లేదు. సినిమా చూస్తుంటే తక్కువలో చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది.

కంక్లూజన్.. 

షాక్ ఇవ్వాలనుకుంటే.. రివర్స్ అయ్యిందేమో !

ఇవి కూడా చదవండి: