Last Updated:

AP Deputy CM Pawan Kalyan: గ్రీన్ కో ప్రాజెక్టుతో 50వేల మందికి ఉపాధి

AP Deputy CM Pawan Kalyan: గ్రీన్ కో ప్రాజెక్టుతో 50వేల మందికి ఉపాధి

AP Deputy CM Pawan Kalyan visit Orvakallu at Kurnool: ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌ కల్యాణ్‌ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పిన్నాపురంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద గ్రీన్‌కో సోలార్‌ పార్క్ తోపాటు పంప్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు సైట్‌ను ఏరియల్‌ వ్యూ ద్వారా అధికారులతో కలిసి పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.

రూ.30వేల కోట్లు పెట్టుబడులు..
ఏపీలో గ్రీన్ కో ప్రాజెక్టు కోసం రూ.30వేల కోట్లు పెట్టుబడులు పెట్టారని, ఇంకా పెడుతూనే ఉన్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. దేశంలో ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టారని వెల్లడించారు. ఈ గ్రీన్ కో ప్రాజెక్టు మూడేళ్ల క్రితం 2021లో కర్నూల్ జిల్లాలో ప్రారంభించారని, ఈ ప్రాజెక్టుకు దాదాపు 10వేల మంది డైరెక్ట్ గా, మరో 40 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందినట్లు పేర్కొన్నారు.

45 హెక్టార్ల భూమి వివాదం..
గ్రీన్ కో ప్రాజెక్టులో దాదాపు 45 హెక్టార్ల భూమి రెవెన్యూ, అటవీశాఖల మధ్య వివాదం నెలకొందని, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకే స్వయంగా వచ్చినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. క్యాంపు కార్యాలయంలో నుంచి చూడడం కంటే స్వయంగా వచ్చి చూసి పరిశీలించాని ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ రంగం తర్వాత గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ చేస్తున్నారని, అందుకే వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు చేపడుతున్నట్లు చెప్పారు.

ప్రపంచంలోనే ఇది మొదటి అతిపెద్ద ప్రాజెక్టు..
గాలి, నీరు, సౌర కాంతితో విద్యుత్ తయారు చేయడంలో ప్రపంచంలోనే ఇది మొదటి అతిపెద్ద ప్రాజెక్టు అని ఆయన తెలిపారు. గ్రీన్ కో ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ.12వేల కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ.10వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు మూడు వంతుల విద్యుత్ అవసరాలను గ్రీన్ కో ప్రాజెక్టు తీర్చగలదని, ఈ ప్రాజెక్టు విషయంలో ఏమైనా వివాదాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయని పవన్ తెలిపారు. ఇందుకోసమే రాష్ట్రంలోని అన్ని జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. అటవీ భూములు ఎంతమేర అన్యాక్రాంతం అయ్యాయనే దానిపై త్వరలో డ్రైవ్ పెడతామన్నారు.