Last Updated:

Urvashi Rautela: సైఫ్‌ అలీఖాన్‌ను క్షమాపణలు కోరిన నటి ఊర్వశీ రౌతేలా – సిగ్గుగా ఉందంటూ సోషల్‌ పోస్ట్‌

Urvashi Rautela: సైఫ్‌ అలీఖాన్‌ను క్షమాపణలు కోరిన నటి ఊర్వశీ రౌతేలా – సిగ్గుగా ఉందంటూ సోషల్‌ పోస్ట్‌

Urvashi Rautela Sorry to Saif Ali Khan: సినీ నటుడు సైఫ్‌ అలీఖాన్‌కు నటి ఊర్వశీ రౌతేలలా క్షమాపణలు కోరారు. ఆయన గాయపడిన తీరుపై తాను స్పందించిన తీరు సిగ్గుచేటుగా అనిపిస్తోందని పేర్కొంది. అయితే ఆమె నటించి లేటెస్ట్‌ తెలుగు మూవీ ‘డాకు మహారాజ్‌’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. వందకోట్ల దాటడంతో ఆమె సక్సెస్‌ జోష్‌లో ఉంది. ఈ క్రమంలో ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెను సైఫ్‌పై జరిగిన దాడి ఘటన స్పందించాలని యాంకర్‌ అడిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ఆయనపై జరిగిన ఈ ఘటన దురదృష్టకరం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అన్నారు. ఆ తర్వాత తన చేతికి ఉన్న డైమండ్‌ రోలెక్స్‌ వాచ్, మిని వాచ్‌ని చూపిస్తూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

“నేను నటించి డాకు మహారాజ్‌ రూ. 105 కోట్ల కలెక్షన్స్ క్రాస్‌ చేసింది. మూవీ సక్సెస్‌ నేపథ్యంలో మా అమ్మ నాకు డైమండ్‌ రోలెక్స్‌ వాచ్‌ బహుమతిగా ఇచ్చింది. మా నాన్న మిని వాచ్‌ ఇచ్చారు. కానీ వీటిని ధరించి ధైర్యంగా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరైనా మనపై అలా దాడి చేస్తారనే భయం ఉంటుంది” అని కామెంట్స్‌ చేసింది. ఆమె కామెంట్స్‌ అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు. సైఫ్‌పై జరిగిన దాడిపై ఆమె స్పందించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై వస్తున్న నెగిటివిటికి ఆమె స్పందించింది. ఈ మేరకు సైఫ్‌కి క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది.

“సైఫ్‌ సర్.. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. మీ గురించి మాట్లాడే టైంలో నేను అలా ప్రవర్తించి ఉండకూడదు. నేను ప్రవర్తించిన తీరుపై మనస్పూర్తిగా మీమ్మల్ని క్షమాపణలు కోరుతున్నా. ఆ సమయంలో మీపై జరిగిన దాడి తీవ్రత గురించి నాకు అవగాహన లేదు. గత కొన్ని రోజుల నుంచి నేను డాకు మహారాజ్ మూవీ సక్సెస్‌లో ఉన్నాను. ఆ సినిమా వల్ల నాకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను. ఇలా ‘డాకు మహారాజ్’ సక్సెస్‌లో ఉన్న నేను మీ విషయంలో మరిచిపోయి ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గు పడుతున్నాను.

ఇప్పుడే మీరు ఎదుర్కొన్న దాడి తీవ్రత గురించి తెలిసింది. దీంతో నేను ప్రవర్తించిన తీరుపై క్షమాపణలు కోరుతూ ఈ పోస్ట్ రాస్తున్నాను. ఆ టైంలో మీరు చూపించిన తెగువ ప్రశంసనీయం. అది తెలిసి మీపై గౌరవం మరింత పెరిగింది. సైఫ్ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి” అంటూ ఆమె రాసుకొచ్చింది. కాగా కాగా రెండు రోజులు సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంట్లో కత్తితో దాడి చేసిన ఈ ఘటన బాలీవుడ్‌ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెన్నుముక, మెడ భాగంలో లోతుగా కత్తిపోట్లు దిగడంతో ఆయనకు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని లీలావది ఆస్పత్రి వైద్యులు తెలిపారు.