Last Updated:

Aman Jaiswal: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం – రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల నటుడు దుర్మరణం

Aman Jaiswal: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం – రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల నటుడు దుర్మరణం

Actor Aman Jaiswal Died: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల నటుడు మృతి చెందాడు. బాలీవుడ్‌ యువ నటుడు అమన్‌ జైస్వాల్‌ ఆడిషన్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై జోగేశ్వరి సమీపంలో అతడి బైక్‌ని ట్రక్కు ఢీ కోట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ అమన్‌ని వెంటనే సమీపంలో కామా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అమన్‌ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో అమన్‌ మృతితో హిందీ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు నటీనటులు అతడి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

ఆడిషన్‌కి వెళ్తుండగా ప్రమాదం

ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ట్రక్కు డ్రైవర్‌ని అదుపులోకి తీసకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం అమన్‌ ఓ కొత్త షోకు ఆడియషన్‌ ఇచ్చేందుకు వెళుతున్నాడు. బైక్‌పై వెళుతుండగా ముంబైలోని జోగేశ్వరి రోడ్డులోని హల్‌ పార్క్‌ వద్ద అతడి బైక్‌ని వేగంగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో అమన్‌ బైక్‌పై నుంచి కింద పడటంతో అతడికి బలమైన గాయాలు అయ్యాయి. దీంతో హుటాహుటిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అతడు మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: