ఆంధ్రప్రదేశ్: “తమ్ముళ్లూ సైకిల్ పోవాలి” అంటున్న చంద్రబాబు.. ఎందుకలా అన్నారంటే..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టంగ్ స్లిప్ అయ్యారు. తన సభకు హాజరయిన జనసందోహాన్ని చూసిన ఆనందంలో సైకిల్ రావాలి అనడానికి బదులుగా సైకిల్ పోవాలి అంటూ నినాదమిచ్చారు.

Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టంగ్ స్లిప్ అయ్యారు. తన సభకు హాజరయిన జనసందోహాన్ని చూసిన ఆనందంలో సైకిల్ రావాలి అనడానికి బదులుగా సైకిల్ పోవాలి అంటూ నినాదమిచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలి లో శుక్రవారం రాత్రి జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
పేదవాడికి న్యాయంజరగాలి అంటే, రైతులకు, రైతు కూలీలకు న్యాయం జరగాలంటే, జాబు రావాలంటే సైకిల్ పోవాలి అని నినాదాలు చేసారు. తరువాత వెంటనే తప్పును గుర్తించి సారీ అంటూ సైకో పాలన పోవాలి సైకిల్ రావాలి అని సరిచేసుకున్నారు. తనపైన పూలు చల్లుతున్నారని దాని వలన తనకు ఎలర్జీ సమస్యలు వచ్చే అవకాశముందని చమత్కరించారు.