Last Updated:

Udhayanidhi Stalin: ఇక సినిమాలకు గుడ్ బై అంటున్న తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్.. ఎందుకంటే..?

యంగ్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారు అయిన ఉదయనిధి స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెప్పాడు. పదేళ్లుగా తన సినిమాలతో మెప్పించిన తమిళ, తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్‌ హీరో ఇకపై సినిమాలు చెయ్యనని పేర్కొన్నారు.

Udhayanidhi Stalin: ఇక సినిమాలకు గుడ్ బై అంటున్న తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్.. ఎందుకంటే..?

Udhayanidhi Stalin: యంగ్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారు అయిన ఉదయనిధి స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెప్పాడు. పదేళ్లుగా తన సినిమాలతో మెప్పించిన తమిళ, తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్‌ హీరో ఇకపై సినిమాలు చెయ్యనని పేర్కొన్నారు.

సినీరంగంలో తనదైన మార్క్..

udhayanidhi-stalin-said-good bye to the films

నిన్న అనగా బుధవారం నాడు మంత్రిగా రాజకీయాల్లో ఆయన కీలక బాధ్యతలు స్వీకరించడం వల్ల సినిమాల్లో నటించడం లేదని ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా పలు సినిమాలు చేసి సినీ ప్రియులకు దగ్గరయ్యారు. రెడ్ జైంట్ మూవీస్ పతాకంపై 2008లో ఉదయనిధి స్టాలిన్.. విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా ‘కురువి’ చిత్రంతో నిర్మాతగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. తరువాత 2009లో ఆధవాన్, 2010లో మన్మధన్ అంబు, 2010లో 7th సెన్స్ వంటి పలు ప్రతిష్టాత్మక చిత్రాలను ఆయన నిర్మించాడు. ఆ తర్వాత 2012లో ఓరు కల్ ఓరు కన్నడి (తెలుగులో ఒకే..ఒకే ) చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేశారు ఉదయనిధి స్టాలిన్. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకవైపు సినిమా రంగంలో ఉంటూనే మరోవైపు రాజకీయ రంగంలోనూ యూత్ లీడర్ గా తన సత్తా చాటారు.

Image

అదే లాస్ట్ సినిమా..

ఇకపోతే గతేడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్‌-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి డీఎంకే పార్టీ తరఫున పోటీ చేసి ఉదయనిధి విజయం సాధించారు. దీనితో అప్పటి నుంచి కొత్త సినిమాలను ఏవీ అంగీకరించ లేదు. ఇక తాజాగా తాను సినిమాల్లో నటించనని స్పష్టం చేశారు. మారిసెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న మామన్నాన్‌ తన చివరి సినిమా అని చెప్పారు. అలాగే కమల్‌ హాసన్‌ ప్రాజెక్ట్‌ నుంచి కూడా వైదొలగినట్లు ఆయన ప్రకటించారు.

Image

నా జీవితం ఇక రాజకీయాలకే పరిమితం..

ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఉదయనిధి ‘నేను రాజకీయ జీవితంలో ఎక్కవ సమయం గడపాలి. నా నియోజకవర్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇప్పుడు ఏ సినిమానైనా అంగీకరిస్తే దానికోసం కనీసం ఐదు నెలలు వెచ్చించాల్సి వస్తుంది. అందుకే ఇకపై సినిమాకు సంబంధించిన ఏ కమిట్‌మెంట్‌లను ఇవ్వదలచుకోలేదు అని చెప్పుకొచ్చారు. మరి ఉదయనిధి స్టాలిన్ కూడా రాజకీయాల్లో తన తాతయ్య కరుణానిధి స్టాలిన్, తండ్రిగారి లెగసీని కంటిన్యూ చెయ్యనున్నారా.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంతవరకూ ఆయన రాణించగలడు.. తనకిచ్చిన మంత్రిపదవిని సద్వినియోగం చెయ్యగలడా అనేది వేచి చూడాలి..

ఇదీ చదవండి: మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్…

ఇవి కూడా చదవండి: