Amritsar Hooch Tragedy: అమృత్‌సర్‌లో విషాదం.. కల్తీ మద్యం తాగి 14 మంది మృతి!

14 dead, a dozen critical after consuming spurious liquor in Amritsar: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కల్తీ మద్యం తాగిన బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా.. కీలక నిందితుడు ప్రభ్‌జిత్ పరారీలో ఉన్నారు.
మజిత ప్రాంతంలో కల్తీ మద్యం తాగి చనిపోయినట్లు సమాచారం వచ్చిందని అమృత్‌సర్ ఎస్పీ మనీందర్ సింగ్ చెప్పారు. ఈ ఘటన రాత్రి 9.30 గంటల సమయంలో కల్తీ మద్యం తాగి కొంతమంది చనిపోయారని స్థానికులు చెప్పడంతో హుటాహుటినా బయలుదేరామని వెల్లడించారు. ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేపట్టామన్నారు. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని చెప్పారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ప్రధాన నిందితుడు ప్రభ్‌జిత్‌ను విచారించగా.. అసలు విషయం బయటకు వచ్చిందన్నారు. కింగ్ పిన్ సరఫరా దారుడు సహబ్ సింగ్ గురించి తెలిసిందన్నారు. వెంటనే అతడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఇప్పటివరకు అతడు ఎన్ని మద్యం దుకాణాలకు సరఫరా చేశాడనే విషయాలు తెలుసుకుంటున్నామన్నారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు.
అయితే పౌరుల సంక్షేమం దృష్ట్యా ప్రాణాలను కాపాడేందుకు ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. ఎంతమంది కల్తీ మద్యం తాగారనే వివరాలు తెలుస్తాయన్నారు. అయితే ఈ కల్తీ మద్యం మొత్తం 5 గ్రామాల్లో జరిగిందని, ఇప్పటివరకు 14 మంది మృతి చెందారన్నారు. ప్రస్తుతం ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని, మిగతా బాధితులు కోలుకుంటున్నట్లు తెలిపారు.