Last Updated:

Goods Train: ఒడిశాలో గూడ్స్ రైలు కిందపడి ఆరుగురు కార్మికుల మృతి

ఒడిశాలోని జాజ్‌పూర్ కియోంజర్ రోడ్ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు కిందపడి ఆరుగురు కార్మికులు మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని రైల్వే అధికారి తెలిపారు.భారీ వర్షం పడటంతో గూడ్స్ కిందకు చేరిన కూలీలు అది అకస్మాత్తుగా గాలులకు కదలడంతో దానికిందే ప్రాణాలు వదిలారు.

Goods Train: ఒడిశాలో గూడ్స్ రైలు  కిందపడి  ఆరుగురు కార్మికుల మృతి

 Goods Train:  ఒడిశాలోని జాజ్‌పూర్ కియోంజర్ రోడ్ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు కిందపడి ఆరుగురు కార్మికులు మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని రైల్వే అధికారి తెలిపారు.భారీ వర్షం పడటంతో గూడ్స్ కిందకు చేరిన కూలీలు అది అకస్మాత్తుగా గాలులకు కదలడంతో దానికిందే ప్రాణాలు వదిలారు.

వర్షం. గాలినుంచి రక్షణకు..( Goods Train)

జాజ్‌పూర్ కియోంజర్ రోడ్ రైల్వే స్టేషన్‌లో రైల్వే కాంట్రాక్టర్ కింద నిర్మాణపనుల్లో వీరందరూ పనిచేస్తున్నారు. వర్షం, గాలులనుంచి రక్షణపొందడానికి ఆగి ఉన్న గూడ్స్ కిందకు చేరారని అధికారి తెలిపారు. గాయపడిన వారిని కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు.

అస్సాంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

మరోవైపు అస్సాం రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. సింగ్రా వద్ద బొగ్గుతో వెడుతున్న గూడ్స్ లోని 20-వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు తెలిసింది. రైలులో దాదాపు 60 వ్యాగన్లు ఉన్నాయి. రైలు మధ్య వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు తెలిసింది. రైలు పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ జిల్లా నుంచి అస్సాంలోని కమ్రూప్ జిల్లాలోని టెటెలియాకు బొగ్గు రవాణా చేస్తోంది.పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదు. పట్టాలు తప్పిన విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను కనుగొనడానికి దర్యాప్తు చేయవలసి ఉంది.