Home / Odisha
సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)కు ఒడిశాలో ఇటీవలకేటాయించిన నైని కోల్ బ్లాక్‌లో మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
ప్రశాంతంగా ఉన్న ఒడిషాలో మత ఘర్షణలు చెలరేగాయి. స్థానికంగా వచ్చే నీరు కాస్తా ఎర్రగా మారడంతో బక్రీద్ సందర్భంగా గో హత్య జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన మోహన్ చరణ్ మాఝీ పేరు ఖరారయింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కియోంఝర్ నుంచి 87,815 ఓట్ల మెజారిటీతో బీజేడీకి చెందిన మినా మాఝీపై విజయం సాధించారు. బుధవారం ఆయన ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఒడిషాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు నవీన్‌పట్నాయక్. ఆయన రాజకీయ వారసుడు వీకె పాండ్యన్ అనే టాక్ గత కొంత కాలంగా రాష్ర్టం మొత్తం వినిపిస్తోంది.
ఒడిషాలో నవీన్ పట్నాయక్ శకం ముగిసింది. గత 24 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఏకచత్రాధిపత్యం నడిపించిన బీజేపీ చీఫ్ నీవన్ పట్నాయక్ బుధవారం నాడు రాజీనామా పత్రాన్ని ఒడిషా గవర్నర్ రఘుబర్‌దాస్‌కు సమర్పించారు.
: ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నాడు ఒడిషాలో సుడిగాలి పర్యటన చేశారు. కటక్‌లో జరగిన ఓ ఎన్నికల ర్యాలీలో బిజు జనతాదళ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ర్టం మొత్తం మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ పీక్‌కు చేరుకుంది. సోమవారం నాడు మూడవ విడత పోలింగ్ జరుగనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీపై ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓడిషాలో పర్యటించారు. సోమవారం నాడు ఉదయం బెహరాంపూర్‌లో ఓ ర్యాలీలో ప్రసంగించారు. ధనిక రాష్ర్టమైన ఒడిషాను వంతుల వారిగా ఇక్కడి ప్రభుత్వాలు లూటీ చేశాయని ఇటు కాంగ్రెస్, అటు బీజు జనతాదళ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
ఎన్నికలు సమీపించే కొద్ది ఒడిషాలో లుంగీ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. రాష్ర్టంలో అసెంబ్లీతో పాటు లోకసభ ఎన్నికలు ఒకే సారి జరుగనున్నాయి. కాగా లుంగీ పాలిటిక్స్‌కు తెరతీసింది మాత్రం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒడిషాలో ప్రజలు లుంగీలు ధరించరు. లుంగీలు ధరిస్తే చులకనగా చూస్తారు.
శుక్రవారం ఒడిశాలో కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు రూ.100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్‌లోని సాహు నివాసాలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.