Last Updated:

SC pulls up Delhi Govt: ఢిల్లీ ట్యాంకర్‌ మాఫియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

దేశ రాజధాని ఢిల్లీలో నీటి కటకట తీవ్రంగా ఉంది. రాజధాని ప్రజలను మంచి నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. అదే సమయంలో ట్యాంకర్‌ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి.

SC pulls up Delhi Govt: ఢిల్లీ ట్యాంకర్‌ మాఫియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

SC pulls up Delhi Govt:దేశ రాజధాని ఢిల్లీలో నీటి కటకట తీవ్రంగా ఉంది. రాజధాని ప్రజలను మంచి నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. అదే సమయంలో ట్యాంకర్‌ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అలాగే ట్యాంకర్‌ మాఫియా వాటర్‌ వేస్టేజీ గురించి సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎలాంటి చర్యలు తీసుకుంటోందని బుధవారం నాడు సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాటర్‌ వేస్టేజీకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఉన్నత న్యాయస్థానం కోరింది. సుప్రీంకోర్టు వేకేషన్‌ బెంచ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, ప్రసన్న బి వరాలేలు ట్యాంకర్‌ మాఫియాపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలియజేయాలని కోరింది. అలాగే ఢిల్లీ పోలీసులను కూడా ట్యాంకర్‌ మాఫియా పట్ల చర్యలు తీసుకోవాలని ఆదేశించనుంది.

మేము రంగంలోకి దిగుతాం.. (SC pulls up Delhi Govt)

ఢిల్లీలో ట్యాంకర్‌ మాఫియా చురుకుగా పనిచేస్తోంది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక వేళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగుతాం.. ఢిల్లీ పోలీసులను ట్యాంకర్‌ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇస్తారా అని ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీసింది. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి నీరు వస్తోంది. అయితే ఈ నీరు ఢిల్లీలో ఏమైపోతోందని ప్రశ్నించింది. టాంకర్‌ మాఫియా నీటిని యధేచ్చగా దొంగిలిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఉన్నత న్యాయస్థానం నిలదీసింది.

మీడియాలో వస్తున్న వార్తల గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. న్యూస్‌ చానల్స్‌ ప్రజలునీటి కోసం పడుతున్న కష్టాలను చూస్తున్నాం. వాటర్‌ ట్యాంకర్లు చేస్తున్న నీటి వృధా గురించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో కోర్టుకు సమాచారం ఇవ్వాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని నిలదీసింది. కాగా ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. హర్యానా ప్రభుత్వాన్ని హిమాచల్‌ ప్రదేశ్‌ పంపుతున్న అదనపు జలాలను ఢిల్లికి విడుదల చేయాలని ఆదేశించాలని కోర్టులో పిటిషన్‌ వేసింది ఢిల్లీ ప్రభుత్వం. కాగా కోర్టు మాత్రం ట్యాంకర్‌ మాఫియా పైపులైన్‌ల ద్వారా అక్రమంగా నీరు తోడుకుంటోంది వాటిని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి: