Last Updated:

Supreme Court: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు

Supreme Court: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు

Supreme Court Once Again Notices to Telangana Assembly Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఆయనకు కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ పిటిషన్‌పై ఈనెల 22లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆయనకు తొలుత ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు ఆయన స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది.

 

ఇదిలా ఉండగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ కోరినా ఫలితం లేకపోవడంతో ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, ఈనెల 25న సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ చేయనుంది.

 

అంతకుముందు విచారణలో భాగంగా ప్రభుత్వంతో పాటు అసెంబ్లీ సెక్రటరీ, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వగా.. ఈనెల 22 వరకు స్పందించాలని చెప్పింది. ఈ గడువు ముగియడంతో సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు అందజేసింది.

 

అయితే, తెలంగాణలో గత కొంతకాలంగా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై తీవ్ర దుమారం రేగుతోంది. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో బీఆర్ఎస్ నేతు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయంపై తీవ్ర చర్చనీయాంశమైంది.