Published On:

3,038 Jobs in Telangana RTC: త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీ: ఎండీ సజ్జనార్

3,038 Jobs in Telangana RTC: త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీ: ఎండీ సజ్జనార్

3,038 Jobs in Telangana RTC: తెలంగాణ ఆర్టీసీలో 3,038 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని పేర్కొన్నారు. వీటి భర్తీ అనంతరం కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన కార్యక్రమంలోని పాల్గొని ప్రకటించారు.

 

అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమం కోసం యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, రాజశేఖర్, ఖుస్రోషా ఖాన్, వెంకన్న, జాయింట్ డైరెక్టర్లు నర్మద, ఉషాదేవి, రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ శ్రీలత, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: