Published On:

Civil War in Sudan: సూడాన్‌లో పౌర యుద్ధం.. 300 మందికి పైగా దుర్మరణం..!

Civil War in Sudan: సూడాన్‌లో పౌర యుద్ధం.. 300 మందికి పైగా దుర్మరణం..!

RSF forces attack Zamzam and Abu Shaq Camps: ఆఫ్రికాలోని సూడాన్‌‌లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్టు ఫోర్స్‌ బలగాలు ఇటీవల దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దాడుల్లో దాదాపు 300 మందికి పైగా దుర్మరణం చెందినట్లు ఐక్యరాజ్యసమితి మానవతా ఏజెన్సీ వెల్లడించింది. జామ్జామ్‌, అబూషాక్‌ శిబిరాలపై వారం రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎఫ్‌ బలగాలు దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 300 మందికి పైగా ప్రజలు మృతిచెందారని ప్రాథమిక గణాంకాలు తెలిపాయని ఆఫీస్‌ ఫర్‌ ది కోఆర్డినేషన్‌ ఆఫ్‌ హ్యుమానిటేరియన్‌ అఫైర్స్‌ (ఓసీహెచ్‌ఏ) పేర్కొంది.

 

మృతుల్లో 10 మంది సిబ్బంది..
మృతుల్లో 10 మంది రిలీఫ్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన మానవతా సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. సిబ్బంది జామ్జామ్‌ శిబిరంలోని ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తుండగా, ప్రాణాలు విడిచినట్లు వెల్లడించింది. మ‌ృతిచెందిన వారిలో 23 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ దాడులను ఖండించారు. శత్రుత్వాన్ని వెంటనే ముంగిచాలని కోరారు. పౌరులు, మానవతా సిబ్బందికి రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు. 16 వేల మంది ప్రజలు జామ్జామ్‌ శిబిరాన్ని వీడినట్లు సమాచాం.

 

2023 ఏప్రిల్‌లో దాడులు..
2023 ఏప్రిల్‌ నెలలో సూడాన్‌ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్-బుర్హాన్ మాజీ డిప్యూటీ, ఆర్‌ఎస్‌ఎఫ్‌ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొన్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. సుడానీస్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ (ఎస్‌ఏఎఫ్), ర్యాపిడ్ సపోర్ట్‌ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్)ల మధ్య జరిగిన దాడులు జరిగాయి. దాడులతో ఇప్పటివరకు 29,600 మంది ప్రజలు ప్రాణాలు మృతిచెందారు. కోటి మందికి పైగా సూడాన్‌ను వదిలివెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి గణాంకాలు వెల్లడించాయి.

 

 

ఇవి కూడా చదవండి: