Published On:

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 25వేల టీచర్ల రిక్రూట్‌మెంట్ రద్దు

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 25వేల టీచర్ల రిక్రూట్‌మెంట్ రద్దు

Supreme Court Sets Aside Appointment Of 25,000 Teachers In Blow To Bengal: సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పశ్చిమ బెంగాల్‌‌లో టీచర్ల నియామకాలపై కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో 2016లో జరిగిన 25 వేల టీచర్ల నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని కొంతమంది పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగానే విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు.. 25వేల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను 2024లో కలకత్తా హైకోర్టు రద్దు చేసింది.

 

అయితే ఈ విషయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇందులో భాగంగానే విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పు.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్దించింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని తెలిపింది. 3 నెలల్లో కొత్త నియామకాలు చేపట్టాలని ఆదేశించింది.

 

ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్కూల్ సర్వీస్ కమిషన్ కింద నియామకాలు చేపట్టింది. కాగా, హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం వివరించింది.