Last Updated:

Maneka Gandhi: గాడిద పాల సబ్బు స్త్రీ శరీరాన్ని అందంగా ఉంచుతుంది.. కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ

బీజేపీ పార్లమెంటు సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ఆకర్షిస్తోంది. వీడియోలో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో మాట్లాడుతూ గాడిద పాల సబ్బు ఎల్లప్పుడూ స్త్రీ శరీరాన్ని అందంగా ఉంచుతుందని చెప్పారు.

Maneka Gandhi: గాడిద పాల సబ్బు స్త్రీ శరీరాన్ని అందంగా ఉంచుతుంది.. కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ

Maneka Gandhi:బీజేపీ పార్లమెంటు సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ఆకర్షిస్తోంది. వీడియోలో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో మాట్లాడుతూ గాడిద పాల సబ్బు ఎల్లప్పుడూ స్త్రీ శరీరాన్ని అందంగా ఉంచుతుందని చెప్పారు. ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా గాడిద పాలతో స్నానం చేసేదని ఆమె పేర్కొన్నారు.

ఒక్కొక్క సబ్బు రూ.500..(Maneka Gandhi)

క్లియోపాత్రా, చాలా పేరుగాంచిన రాణి, గాడిద పాలతో స్నానం చేసేది. ఢిల్లీలో గాడిద పాలతో తయారు చేసే సబ్బులు ఒక్కొక్కటి రూ.500. మేక పాలతో మరియు గాడిద పాలతో సబ్బులు తయారు చేయడం ఎందుకు ప్రారంభించకూడదు? అని ఆమె ప్రశ్నించారు.లడఖ్ కమ్యూనిటీ సబ్బులను తయారు చేయడానికి గాడిద పాలను ఉపయోగిస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు. మీరు గాడిదను చూసి ఎంతకాలం అయ్యింది? వాటి సంఖ్య తగ్గుతోంది. చాకలివారు కూడా గాడిదలను ఉపయోగించడం మానేశారు. లడఖ్‌లో గాడిదల సంఖ్య తగ్గుతున్నట్లు గమనించిన ఒక సంఘం ఉంది. కాబట్టి వారు గాడిదలకు పాలు పట్టడం ప్రారంభించి, ఆ పాలను సబ్బు తయారీకి ఉపయోగించారు.

దహనాలకు కలపను ఉపయోగించవద్దు..

అంతేకాదు చెట్లు అంతరించిపోతున్నాయని, అందువల్ల కలప ఖరీదైనదిగా మారిందని మేనకా గాంధీ పేర్కొన్నారు. అదే కారణంతో దహన సంస్కారాల ఖర్చు కూడా పెరిగింది. చెక్క చాలా ఖరీదైనది, మరణంలో కూడా ప్రజలు తమ కుటుంబాన్ని పేదలుగా వదిలివేస్తారు. చెక్క ధర సుమారు రూ. 15,000 – రూ20,000. బదులుగా, మనం ఆవు పేడలో సుగంధ పదార్థాన్ని జోడించి, మృతదేహాన్ని దహనం చేయడానికి ఉపయోగించాలి. దీనితో ఖర్చుతగ్గుతుంది. అపుడు దహన సంస్కారాల ఖర్చు కేవలం రూ.1,500 నుండి రూ2,000 మాత్రమే అవుతుందన్నారు.

పశువుల పెంపకంతో ఆదాయం రాదు..

పశువుల పెంపకంతో డబ్బు సంపాదించడం సాధ్యం కాదని మేనక అన్నారు. ఈనాటికి మేకలు, ఆవుల పెంపకంలో ఎవరూ ధనవంతులు కాలేదు. ఆవు, గేదె, మేక జబ్బు పడితే వాటి కోసం లక్షలు ఖర్చు పెడతారు.. ఆడవాళ్ళు కూడా పశుపోషణలో సహాయం చేస్తారు. అయితే వారు ఎంత చేయగలరు? అందుకే ఎవరైనా మేక లేదా ఆవును పెంచడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. మీరు సంపాదించడానికి ఒక దశాబ్దం పడుతుంది. కానీ జంతువు ఒక రాత్రి చనిపోతుంది అంతా అయిపోతుంది అంటూ మేనక వ్యాఖ్యానించారు.