Bihar: బీహార్ కల్తీ మద్యం కేసులో కీలక వ్యక్తి అరెస్ట్
బీహార్‌లోని సరన్‌లో 73 మంది ప్రాణాలను బలిగొన్నకల్తీ మద్యం విషాదానికి సంబంధించిన కేసులో కీలకవ్యక్తిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసినట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
Bihar: బీహార్‌లోని సరన్‌లో 73 మంది ప్రాణాలను బలిగొన్నకల్తీ మద్యం విషాదానికి సంబంధించిన కేసులో కీలకవ్యక్తిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసినట్లు శనివారం ఒక అధికారి తెలిపారు. నిందితుడిని సరన్ జిల్లా డోయిలా గ్రామానికి చెందిన రామ్ బాబు మహతోగా గుర్తించారు.
స్పెషల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, మహతో ఢిల్లీలో దాక్కున్నట్లు క్రైమ్ బ్రాంచ్‌లోని ఇంటర్‌స్టేట్ సెల్‌కు సమాచారం అందింది.సాంకేతిక నిఘా మరియు నిర్దిష్ట ఇన్‌పుట్‌ల ఆధారంగా, మహతోద్వారక నుండి పట్టుబడ్డాడు” అని యాదవ్ చెప్పారు.. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతడాయని అన్నారు. నిందితుడి అరెస్టు గురించి తదుపరి చర్య కోసం బీహార్ పోలీసులకు సమాచారం అందించామన్నారు.
మహతో 8వ తరగతి వరకు చదువుకున్నాడు.రాష్ట్రంలో మద్యపాన నిషేధం కారణంగా, అతను త్వరగా మరియు సులభంగా డబ్బు సంపాదించడానికి ఒక అవకాశంగా భావించాడు . దీనితో నకిలీ మద్యం తయారీ మరియు అమ్మకంలో కొనసాగుతున్నాడని యాదవ్ చెప్పారు.అతనికి ఏడు అక్రమ మద్యం కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.బీహార్‌లో మద్యపాన నిషేధం ఉంది. దీనితో సులభంగా డబ్బు సంపాదించడానికి నకిలీ మద్యం తయారీ మరియు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని పోలీసులు తెలిపారు.