Last Updated:

Nagaland: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఇద్దరు మహిళా అభ్యర్థుల ఎన్నిక

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఇద్దరు మహిళా అభ్యర్థులు -సల్హౌతుయోనువో క్రూసే మరియు హెకాని జఖ్లాలు - గురువారం నాడు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇద్దరు అభ్యర్థులు అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి)కి చెందినవారు.

Nagaland: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఇద్దరు మహిళా అభ్యర్థుల ఎన్నిక

Nagaland: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఇద్దరు మహిళా అభ్యర్థులు  సల్హౌతుయోనువో క్రూసే మరియు హెకాని జఖ్లాలు – గురువారం నాడు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇద్దరు అభ్యర్థులు అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి)కి చెందినవారు. పశ్చిమ అంగామి ఏసీ నుంచి సల్హౌతుయోనువో క్రూసే గెలుపొందగా, దిమాపూర్-3 నియోజకవర్గాల్లో హెకానీ జఖాలు విజయం సాధించారు.

స్థానిక హోటల్ యజమాని సల్హౌటుయోనువో క్రూస్ స్వతంత్ర అభ్యర్థి కెనీజాఖో నఖ్రోపై పోటీ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియు రియో క్రూసే కోసం ప్రచారం చేశారు. జఖాలు ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ఆమె యూఎస్ లో న్యాయవిద్యను అభ్యసించారు, సామాజిక కార్యకర్తమరియు యూత్ నెట్ వ్యవస్థాపకురాలు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి నుంచి ఆమె నారీ శక్తి పురస్కార్ అవార్డును కూడా అందుకుంది.

60 ఏళ్లలో ఒక్క మహిళా ఎమ్మేల్యే కూడా లేరు..(Nagaland)

1963లో నాగాలాండ్‌కు రాష్ట్ర హోదా లభించినప్పటి నుంచి 60 మంది సభ్యుల అసెంబ్లీలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. మహిళలు ఎన్నికల్లో పోటీ చేసినా వారు విజయం సాధించలేదు. . ఈ ఏడాది ఎన్నికల్లో నలుగురు మహిళా అభ్యర్దులు పోటీ చేసారు. 1977లో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ టిక్కెట్‌పై రానో మీసే షాజియా నాగాలాండ్ నుంచి లోక్‌సభ కు ఎన్నికయ్యారు. ఆ తర్వాత, నాగాలాండ్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎస్ ఫాంగ్నాన్ కొన్యాక్‌ను బిజెపి నామినేట్ చేయడంతో ఈశాన్య రాష్ట్రం నుండి రెండవ మహిళ పార్లమెంటులోకి ప్రవేశించింది.నాగాలాండ్‌లో లోక్‌సభ మరియు రాజ్యసభలో ఒక్కో సీటు ఉన్నాయి.

నాగాలాండ్ లో బీజేపీ కూటమిదే అధికారం..

ముఖ్యమంత్రి నీఫియు రియో నేతృత్వంలోని ఎన్‌డిపిపి, 2018లో గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. గత ఎన్నికల్లో 30 స్థానాల్లో గెలిచిన కూటమి ప్రస్తుతం 39 స్థానాల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోనుంది. నాగాలాండ్. 60 సీట్ల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 31.సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేయగా, ఎన్‌డిపిపి 40 స్థానాల్లో పోటీ చేసింది.