Last Updated:

Soonu Sood Wife: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సోనూసూద్‌ భార్య సోనాలి..

Soonu Sood Wife: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సోనూసూద్‌ భార్య సోనాలి..

Sonu Sood Wife Sonali injured in Car Crash: సినీనటుడు, రియల్‌ హీరో సోనూ సూద్‌ భార్య సోనాలీ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ముంబై నుంచి నాగ్‌పూర్‌ వెళ్తుండగా సోమవారం అర్ధరాత్రి ఆమె కారు ప్రమాదానికి గురైనట్టు సమాచారం. తన సోదరి, మేనల్లుడితో కలిసి ఆమె కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ముంబై-నాగ్‌పూర్‌ హైవే వద్ద వారి కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సోనూ సూద్‌ భార్య సోనాలి, ఆమె మేనల్లుడి త్రీవంగా గాయపడగా.. ఆమె సోదరి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

గాయపడ్డ సోనాలి, ఆమె మేనల్లుడిని నాగ్‌పూర్‌లోని మాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. 48 నుంచి 72 గంటల పాటు సోనాలి, ఆమె మేనల్లుడు వైద్యులు అబ్జర్వేషన్‌ ఉన్నట్లు సోనుసూద్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఆమె కారు నుజ్జునుజ్జయ్యింది.  విషయం తెలుసుకున్న  సోను సూద్‌ వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే సోనాలి ఆరోగ్యంపై వైద్యులు త్వరలోనే అప్‌డేట్‌ ఇవ్వనున్నారు.