Last Updated:

Allu Arjun Remuneration: హాట్‌టాపిక్‌గా అల్లు అర్జున్‌ రెమ్యునరేషన్‌ – అట్లీ సినిమాకు బన్నీ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

Allu Arjun Remuneration: హాట్‌టాపిక్‌గా అల్లు అర్జున్‌ రెమ్యునరేషన్‌ – అట్లీ సినిమాకు బన్నీ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

Allu Arjun Shocking Remuneration For Atlee Movie: పుష్ప సీక్వెల్స్‌తో ఐకాన్‌ అల్లు అర్జున్‌ మార్కెట్‌ అమాంతం పెరిగింది. ఇప్పుడు పాన్‌ ఇండియా కాదు.. ఇంటర్నేషనల్‌ స్టార్‌ క్రేజ్‌కి ఎదిగాడు బన్నీ. పుష్ప 2తో ఇండస్ట్రీ హిట్‌ కొట్టడమే కాదు రికార్డు మీది రికార్డు నెలకొల్పాడు. ఇండియానే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో పుష్ప 2 రెండో స్థానంలో ఉంది. ఇందులో బన్నీ యాక్టింగ్‌, ఎనర్జీ లెవల్‌కి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. రప్పా రప్పా అంటూ పుష్ప 2 కలెక్షన్స్‌లో ఊచకోత చూపించింది. ఇలా ఎన్నో రికార్డులు నెలకొల్పిన బన్నీ క్రేజ్‌ ఇప్పుడు మామూలుగా లేదు. ఇక ఆయన నెక్ట్స్‌ సినిమా కోసం దర్శక-నిర్మాతలు పోటీ పడుతున్నారు.

నెక్ట్స్‌ అట్లీతోనే..

ఇప్పటికే అతడి చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అందులో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో పాటు తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీతో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఇందులో బన్నీ దేనికి ముందు డేట్స్‌ ఇస్తాడు, ఏ సినిమాలోనే సెట్స్‌పైకి తీసువస్తాడా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కొందరు త్రివిక్రమ్‌తోనే నెక్ట్స్‌ సినిమా అంటుంటే మరికొందరు అల్రెడీ అట్లీతో సినిమా సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని, త్వరలోనే మూవీని సెట్స్‌పైకి తీసుకురాబోతున్నారంటూ గుసగుసలు వినిస్తున్నాయి. ఇదే విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు కూడా స్పష్టం చేశారు.

రూ. 175 కోట్ల పారితోషికం!

బన్నీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని, అట్లీ సినిమా కోసం మేకోవర్‌ అవుతున్నాడని ఇటీవల మైత్రీ మేకర్స్ చెప్పారు. దీంతో అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ చేయబోయేది అట్లీతోనే అని స్పష్టమైంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా బన్నీ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌ అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం బన్నీ భారీగానే తీసుకుంటున్నాడట. పుష్ప 2 ఇండస్ట్రీ హిట్‌ కొట్టడంతో అల్లు అర్జున్‌ తన రెమ్యునరేషన్‌ భారీ పెంచేశాడు. మొన్నటి వరకు వందకోట్ల లోపు పారితోషికం తీసుకున్న బన్నీ అట్లీతో చేసే సినిమాకు రూ. 175 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడు. బన్నీకి ప్రస్తుతం ఉన్న క్రేజ్‌, మార్కెట్‌ దృష్ట్యా ఈ పారితోషికం ఇచ్చేందుకు మేకర్స్‌ ఏమాత్రం వెనకాడలేదట.

లాభాల్లో 15 శాతం కూడా?

ఈ దెబ్బతో ఇండియాలోనే అత్యధిక పారితోషికునే నటుడిగా నిలిచాడు. ఒక్క రెమ్యునరేషన్‌ మాత్రమే కాదు ఈ సినిమా లాభాల్లో 15 శాతం వాటా కూడా తీసుకుంటున్నాడని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ టీం స్పందించేవరకు వేచి చూడాల్సిందే. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ 22వ సినిమాగా ఇది రూపొందనుంది. దీనికి అట్లీ-అల్లుర్జున్‌22 (AA22) వర్కింగ్‌ టైటిల్‌తో అనౌన్స్‌మెంట్‌ రానుంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పూజా కార్యక్రమంలో ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా లాంచ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఆగష్టు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక సినిమా సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కబోతోంది.