Bandi Sanjay comments: ఢిల్లీ నుంచి పులి వేటాడటం ప్రారంభించింది.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
ఢిల్లీ నుంచి పులి వేటాడం, వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి అమిత్ షా అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం చేవెళ్ల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ నన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఎనిమిది గంటలు రోడ్లపైనే తిప్పారు.

Bandi Sanjay comments: ఢిల్లీ నుంచి పులి వేటాడం, వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి అమిత్ షా అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం చేవెళ్ల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ నన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఎనిమిది గంటలు రోడ్లపైనే తిప్పారు. కరీంనగర్ దాటాక ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని నా భార్య చెప్పింది. అమిత్ షా మా ఆవిడకి ఫోన్ చేసి దైర్యం చెప్పారని అన్నారు. కానిస్టేబుల్స్ టెన్షన్ పడ్డారు. అపుడు నేను దైర్యం చెప్పాను. బీజేపీ కార్యకర్తలకు అండగా పులి ఉంటుందని చెప్పాను. ఆ పులి అమిత్ షా అని అన్నారు.
రామరాజ్యం స్దాపిస్తాము..(Bandi Sanjay comments)
సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మారారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రం అభివృద్దికాకుండా అడ్డుపడుతున్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాడితే అన్నిరంగాల్లో అభివృద్ది చేస్తాం. పేదలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య, రైతులను ఆదుకుంటాం. జాబ్ కాలెండర్ ను రిలీజ్ చేస్తాము. నియామకప్రక్రియ ప్రారంభిస్తాము. 1వ తేదీన జీతాలిస్తాము. ఈ రాక్షస రాజ్యాన్ని, నియంత ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి రామరాజ్యం స్దాపిస్తాము. మమ్నల్ని ఆదరించి ఆశీర్వదించండి. అంతవరకూ పోలీసు కేసులకు, జైళ్లకు భయపడం అని బండి సంజయ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- Fan War Murder : అత్తిలిలో పవన్, ప్రభాస్ ల ఫ్యాన్ వార్.. స్నేహితుడిని కొట్టి చంపిన దారుణ ఘటన
- Etela Rajender: రేవంత్ రెడ్డి సవాల్ కు ఈటెల రాజేందర్ రిప్లై