Home / Heavy Rain
Heavy rain forecast for AP Storm in the Bay of Bengal: ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరోసారి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నానికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 12వ తేదీలోపు తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరువవుతుందని […]
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తర మెక్సికన్ రాష్ట్రమైన తమౌలిపాస్‌లోని పట్టణ ప్రాంతంలో సుమారుగా 200 మొసళ్ళు ప్రవేశించాయని అధికారులు తెలిపారు. జాన్ నుంచి ఇప్పటి వరకు బెరిల్ హరికేన్ ఇతర తుఫాన్లతో ఇక్కడ కుండపోత వర్షాలు కురిసాయి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి కురిసిన కుండపోత వర్షానికి సీతారామ చంద్రస్వామివారి ఆలయ పరిసరాలన్నీ నీట మునిగాయి
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వేర్వేరు ఘటనల్లో 13 మంది మృతి చెందారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. కూకట్పల్లి, మియాపూర్, బాలానగర్, సనత్‌నగర్..పంజాగుట్ట, మాదాపూర్, ఉప్పల్, జీడిమెట్లలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్‌లోని మాల్దేవ్తాలోని డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం సోమవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య కుప్పకూలింది. భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌తో పాటు.. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు మెల్లిమెల్లిగా ముందుకుసాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారడంతో ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికాలు జారీ చేసింది.
Hyderabad Rain: హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం మారింది.
Rain Fall: ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న.. ఉన్నట్లుండి భారీ వర్షం కురిసింది.