Published On:

Dilsukhnagar Bomb Blast Case Verdict: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు!

Dilsukhnagar Bomb Blast Case Verdict: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు!

Sensational Verdict on Dilsukhnagar Bomb Blast Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులు వేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. ఇందులో 5 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. 5 మంది నిందితులకు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం ఉరిశిక్షను ఖరారు చేసింది. 45 రోజులపాటు హైకోర్టు సుదీర్ఘంగా విచారణను జరిపింది. 2016 డిసెంబర్ 13న 5 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఇవాళ విచారణకు రాగా, 5 మంది నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పును వెల్లడించారు.

 

కేసులో ఏ-2 అసదుల్లా అక్తర్ (ఉత్తరప్రదేశ్), ఏ-3జియ ఉర్ రహమాన్ (పాకిస్థాన్), ఏ-4 మహమ్మద్ తహసీన్ అక్తర్ హాసన్ (బీహార్ ), ఏ-5 మహమ్మద్ యాసిన్ భత్కల్, ఏ-6 అజాజ్ షేక్ సమర్ అర్మాన్ (మహారాష్ట్ర) ఉన్నారు. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ అలియాస్ మహమ్మద్ రియాజ్ పరారీలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి: