Published On:

Deputy CM Bhatti Vikramarka : ముగిసిన అఖిలపక్ష ఎంపీల సమావేశం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక పిలుపు

Deputy CM Bhatti Vikramarka : ముగిసిన అఖిలపక్ష ఎంపీల సమావేశం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక పిలుపు

Deputy CM Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో అఖిలపక్ష ఎంపీలతో శనివారం నిర్వహించిన సమావేశం ముగిసింది. కేంద్రం వద్ద అపరిష్కృత అంశాలపై చర్చించారు. పెండింగ్ సమస్యల సాధన అజెండాగా సమావేశం సాగింది. నిధులపై పార్లమెంట్‌లో ఎలా పోరాడాలో చర్చించినట్లు డిప్యూటీ సీఎం మీడియాకు వివరించారు. సమావేశానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎంపీలు హాజరుకాలేదు. దాదాపు 28 అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. విభజన సమస్యలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని భట్టి చెప్పారు.

బీజేపీ ఎంపీలు గైర్హాజరు..
చివరి నిమిషంలో సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరు కాలేదు. ఆహ్వానం ఆలస్యంగా అందిందని, ఎంపీల సమావేశంపై పార్టీలో చర్చించుకునే సమయం కూడా లేదు. ముందుగా నిర్ణయించుకున్న పార్టీ కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోతున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగా సమాచారం ఇవ్వాలని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి భట్టికి లేఖ రాశారు.

28 అంశాలు..
1. ప్రాంతీయ రింగు రోడ్డుకు ఆమోదం, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్ల అభివృద్ధి.
2. మెట్రో 2వ దశ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు, బాపుఘాట్‌ను గాంధీ సరోవర్‌గా అభివృద్ధి.
3. గోదావరి-మూసీనది లింకు ప్రాజెక్టు, హైదరాబాద్ నగరం కోసం మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్.
4. వరంగల్ భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక, బందర్‌పోర్టు నుంచి నగరం సమీపంలోని డ్రై పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే.
5. ఎస్‍సీసీఎల్ కోసం బొగ్గు బ్లాకుల కేటాయింపు, సెమీ కండక్టర్ మిషన్, ఐపీఎస్ కేడర్ సమీక్ష.
6. పీఎస్‍డీఎఫ్ కింద పథకాల మంజూరు, పీఎం కుసుమ్-ఏ,బీ,సీ కింద కేటాయింపు.
7. తాడిచెర్ల బొగ్గు బ్లాక్ -II మైనింగ్ లీజు, వివిధ కార్పొరేషన్లు, ఎస్‍పీవీల రుణ పునర్నిర్మాణం.
8. వర్తించే ఇంటర్‌తో GOTGకి చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి.
9. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద GoTGకి చెల్లించాల్సిన గ్రాంట్ విడుదల కోసం విజ్ఞప్తి.
10. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సీఎస్ఎస్ నిధుల విడుదల్లో లోపాన్ని సరిదిద్దమని విజ్ఞప్తి
11. ఏపీ బిల్డింగ్, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు, కార్మిక సంక్షేమ నిధిలో తెలంగాణకు వాటా కోసం నిధులు బదిలీ చేయాలని అభ్యర్థన.
12. ఏపీ పవర్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన మొత్తానికి సంబంధించి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి.
13. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, రైళ్ల కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తి.
14. ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, వెనకబడిన ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీని మెరుగుపర్చడం.
15. పీఎం మిత్రా పార్కు పథకం కింద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు.
16. అన్‌కవర్డ్ జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు.

ఇవి కూడా చదవండి: