Home / Deputy CM Bhatti Vikramarka
Telangana Deputy CM Bhatti Vikramarka ordered withdraw the cases on HCU students: హెచ్‌సీయూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం, ప్రజాసంఘాల ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. ప్రజాసంఘాల నుంచి […]
Deputy CM Bhatti Vikramarka : ప్రత్యేక తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాటం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. యువత ఆశలను నెరవేరుస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 53 వేల మందికి నియామకపత్రాలు అందజేశామని తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలోని 112 మంది భూ నిర్వాసితులకు టీఎస్ జెన్కో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. శుక్రవారం మాదాపూర్ సైబర్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేశారు. దామచర్ల […]
Bhatti Vikramarka : హెచ్‌సీయూ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించవద్దని సూచించారు. హెచ్సీయూకు సంబంధించిన ఇంచు భూమిని ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విద్యార్థులపై లాఠీఛార్జీ జరగడం బాధాకరమన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జీ చేయొద్దని పోలీసులను ఆదేశించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో అక్కడ ఉన్న విద్యార్థులను కొందరు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. […]
Bhatti Vikramarka : అబద్ధాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు బతుకుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలనే సోయి పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. తాజాగా సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అబద్ధపు ప్రచారం.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి భూములను […]
Revanth Reddy : ప్రజాసంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచస్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకురావాలని యత్నిస్తున్నామని చెప్పారు. ఇవాళ రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ షడ్రుచుల కలయికలా ఉందని చెప్పారు. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేదే ఆయన ఆలోచన అన్నారు. బడ్జెట్లో […]
Deputy CM Bhatti Vikramarka key Statement Funds from Taxes in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్‌పై కాగ్ నివేదిక అందజేశారు. ఈ కాగ్ నివేదికలో 2023-24 ఏడాదికి గానూ రూ.2,77,690 కోట్ల బడ్జెట్‌ను అంచనా వేసింది. ఇందులో వ్యయం […]
Deputy CM Bhatti Vikramarka sentational comments Dharani Portal: అసెంబ్లీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోందన్నారు. దున్నేవాడిదే భూమి కదా.. ఇదే సాయుధ పోరాట నినాదమని విక్రమార్క అన్నారు. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి అని విమర్శలు చేశారు. ధరణిని […]
Bhatti Vikramarka : గత బీఆర్ఎస్ సర్కారు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా అప్పులు తెచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు మొత్తం రూ.16.70లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఆ మొత్తంతో ఏం నిర్మించారని ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.16.70లక్షల కోట్లతో నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పీ, ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టు నిర్మించారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరానికి […]
Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో తొలిసారి కాంగ్రెస్ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో సృష్టించిన సవాళ్లను ఏడాదిలోనే దాటామని అన్నారు. ప్రజా సంక్షేమమేతమకు ముఖ్యమని వెల్లడించారు. ప్రధానంగా పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి […]
Telangana Budget 2025-26 to be presented by batti Vikramarka: తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఏడాదికి సంబంధించి పద్దులు రూ.3లక్షలకుపైగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే 2024-25 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు కాగా, ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఇదే కావడం విశేషం.