South Central Railway: ప్రయాణికుల కోసం మరిన్ని స్పెషల్ ట్రైన్స్

Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్ నడుపుతోన్న రైల్వే.. తాజాగా మరో మార్గంలో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్ లోని సుబేదార్ గంజ్ వరకు రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు నేటి నుంచి ఆగస్టు 2 వరకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.
రైలు నెం. 04121 సుబేదార్ గంజ్- చర్లపల్లి మధ్య నేటి నుంచి జూలై 31 వరకు ప్రతి గురువారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.సుబేదార్ గంజ్ లో ఈరైలు మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 8 గంటలకు చర్లపల్లి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 04122 చర్లపల్లి- సుబేదార్ గంజ్ మధ్య జూన్ 28 నుంచి ఆగస్టు 2 వరకు ప్రతి శనివారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. చర్లపల్లిలో ఈ రైలు ఉదయం 4.30 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సుబేదార్ గంజ్ చేరుకుంటుంది.
ఈ రైలులో థర్డ్ ఏసీ, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రైలు కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, నాగపూర్, జుజార్ పూర్, ఇటార్సీ, రాణి కమలాపతి, బీనా, విరంగన లక్ష్మీబాయి ఝూన్సీ, ఒరాయ్, పోఖ్రాయాన్, గోవింద్ పురి, ఫతేపూర్ స్టేషన్లలో ఆగుతుంది.