Tenth Supplymentary Results: టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Tenth Results Released: రాష్ట్రంలో పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఫలితాలను విడుదల చేశారు. కాగా మొత్తం 73.35 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. ఇందులో బాలికలు 77.08 శాతం, బాలురు 71.05 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. కాగా సప్లిమెంటరీ ఫలితాల్లో జనగామ జిల్లా 100 శాతం ఉత్తీర్ణత సాధించి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇక 55.90 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 42,834 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 38,741 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 28,415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే విద్యాశాఖ అధికారులను సంప్రదించాలన్నారు. రీకౌంటింగ్ చేయించాలనుకుంటే ప్రతి సబ్జెక్ట్ కు రూ. 500 చొప్పున చెల్లించాలన్నారు. అలాగే రీవెరిఫికేషన్ కోసం ప్రతి పేపర్ కు రూ. 1000 చెల్లించాలని సూచించారు. జులై 7 లోపు సంబంధిత స్కూల్ ప్రిన్సిపాల్స్ వద్ద అప్లై చేసుకోవాలని తెలిపారు.