Theatre ceiling: కుబేర మూవీ చుస్తుండగా కూలిన సీలింగ్

Theatre Ceiling Collapsed: స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్డున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబోలో లేటెస్ట్ గా విడుదలైన మూవీ కుబేర. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీకి పాజిటీవ్ టాక్ రావడంతోపాటు కలెక్షన్స్ సునామీ వస్తోంది. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా కుబేర మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో జూన్ 20 విడుదలైంది.
అయితే కుబేర సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఓ చేదు అనుభవం ఎదురైంది. మహబూబాబాద్ లోని ముకుంద థియేటర్ లో నిన్న రాత్రి కుబేర సినిమా సెకండ్ షో చూస్తుండగా.. థియేటర్ సీలింగ్ పైకప్పు హఠాత్తుగా ఊడి ఒక్కసారిగా ఆడియన్స్ పై పడింది. దీంతో సినిమా చూస్తున్న పలువురు ప్రేక్షకులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. థియేటర్ నిర్వహణ సరిగా లేదని ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంపై గొడవకు దిగారు. ప్రేక్షలుక పట్ల నిర్లక్ష్యంగా ఉన్న థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.