Published On:

Watch: హైకోర్టు లైవ్ స్ట్రీమ్‌ విచారణకు టాయిలెట్ నుంచి హాజరు.. వీడియో వైరల్

Watch: హైకోర్టు లైవ్ స్ట్రీమ్‌ విచారణకు టాయిలెట్ నుంచి హాజరు.. వీడియో వైరల్

Man Attends Court Live Stream From Toilet: హైకోర్టులో జరిగిన లైవ్ స్ట్రీమ్‌ విచారణకు ఓ వ్యక్తి టాయిలెట్‌ నుంచి హాజరయ్యాడు. టాయిలెట్‌ సీటుపై కూర్చొన్న అతడు జూమ్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నాడు. వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నెల 20వ తేదీన గుజరాత్‌ హైకోర్టులో చెక్ బౌన్స్ కేసుపై విచారణ జరిగింది. కేసును రద్దు చేయాలన్న ప్రతివాది పిటిషిన్‌ను గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి నిర్జార్ ఎస్.దేశాయ్‌ పరిశీలించారు.

 

ప్రతివాది అయిన వ్యక్తి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వర్చువల్‌గా కోర్టు విచారణలో పాల్గొన్నాడు. టాయిలెట్‌లో ఉన్న అతడు అక్కడి నుంచే ‘సమద్ బ్యాటరీ’ పేరుతో జూమ్‌ లైవ్ స్ట్రీమ్‌లో కనిపించాడు. టాయిలెట్‌ సీటుపై కూర్చొన్న వ్యక్తి మొబైల్ ఫోన్‌ నేలపై ఉంచాడు. బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌ ధరించి కోర్టు విచారణలో పాల్గొన్నాడు. అనంతరం దానిని శుభ్రం చేసుకున్న అతడు టాయిలెట్‌ నుంచి మరో గదిలోకి వెళ్లాడు. కోర్టు గదిలో ఉన్న లాయర్ వ్యక్తి తరఫున వాదనలు వినిపించాడు.

 

మరోవైపు లైవ్ స్ట్రీమ్‌ కోర్టు విచారణకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో వ్యక్తి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అతడిపై చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేశారు.

 

ఇవి కూడా చదవండి: