Published On:

Road Accident in Suryapet: రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ దుర్మరణం!

Road Accident in Suryapet: రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ దుర్మరణం!

SI, Constable Died in Suryapet Road Accident: సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ దుర్గాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పతికి పంపారు.

 

మృతులు ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్, హెడ్ కానిస్టేబుల్ స్వామిగా గుర్తించారు. కాగా ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ బ్లెస్సిన్, డ్రైవర్ రమేశ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఓ కేసు విషయమై రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు ప్రైవేట్ వాహనంలో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంపై మృతుల, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు, ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: