Kolkata: కోల్‌కతాలో ఘోరం.. పెళ్లిని నిరాకరించిందని లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

gang rape in Kolkata Law student : కోల్‌కతాలో ఘోరమైన ఘటన జరిగింది. లా విద్యార్థినిపై కళాశాల ప్రాంగణంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఇటీవల కోల్‌కతాలో ఓ జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. కస్బాలోని సౌత్ కోల్‌కతా లా కళాశాలలో ఘటన జరిగింది. ఈ నెల 25 రాత్రి ఓ విద్యార్థినిని కొందరు వ్యక్తులు బలవంతంగా సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటిరోజు ఘటనపై కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇద్దరు సిబ్బంది, మరొకరు పూర్వ విద్యార్థి ఉన్నారు. బాధితురాలికి ప్రాథమిక చికిత్స అందించి, వాంగ్మూలం తీసుకున్నారు.
ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ సిబ్బంది పరిశీలిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుంది. ఘటనపై బీజేపీ నేత అమిత్ మాలవీయా స్పందించారు. దారుణాన్ని ఆయన ఖండించారు. రాష్ట్ర సర్కారుపై మండిపడ్డారు. లా విద్యార్థినిపై కళాశాలలో సామూహిక అత్యాచారం జరిగింది. నిందితుల్లో పూర్వ విద్యార్థితో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
టీఎంసీ పార్టీకి చెందిన ఓ సభ్యుడు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జీకర్ భయానక ఘటనను మరవకముందే మరో ఘటన జరిగింది. పశ్చిమబెంగాల్‌లో ఇలాంటి దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. అత్యాచారం నిత్యకృత్యంగా మారింది. బాధితురాలికి, ఆమె కుటుంబసభ్యులకు భాజపా అండగా ఉంటుందని బీజేపీ నేత అమిత్ మాలవీయా తెలిపారు. నిందితులకు శిక్ష పడేవరకు ఊరుకోమని ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు.