Bus Accident: శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా

Bus Overturned In Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్తున్న మినీ బస్సు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. దోమలపెంట వద్దకు రాగానే బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో బస్సును అదుపుచేసే క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొంది. అనంతరం కొంత దూరం ముందుకు వెళ్లి బోల్తా పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగడంతో శ్రీశైలం వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.