Telangana Local Body Elections 2025: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహం

Telangana Local Body Elections 2025: స్థానిక సంస్థల ఎన్నికలు మరో 3 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మరికొన్ని రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది. అయితే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది. అయితే ప్రజల్లో ఒక పాజిటివ్ మూడ్ వచ్చేలా చేసి ఎన్నికల సైరాన్ మోగించాలని పీసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే రానున్న స్థానిక ఎన్నికల కోసం అధికార పార్టీ ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఏడాదిన్నర అయింది. స్థానిక సంస్థల సమయం ముగిసిపోయి కూడా దాదాపుగా 12 నుండి 14 నెలలు అవుతుంది. ఇప్పటికే ఇంకెప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయానే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. ప్రతిపక్షలు సైతం ఎన్నికలు నిర్వహించే ఆలోచన సర్కార్ కి లేదని, ప్రజల్లో వ్యతిరేకత ఉందనే భయం నెలకొందంటు విమర్శలు చేస్తున్నాయి. ఐతే హస్తం పార్టీ చెప్పిన్నట్లు 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసే ఎన్నికలకు వెళ్తుందని పీసీసీ చెప్పుకోస్తుంది. ఒకవేళ కోర్టు తీర్పు రాకపోయినా.. పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి అధికార పార్టీ సిద్ధంగానే ఉన్నట్లు సంకేతలు ఇచ్చింది.
అయితే హస్తం పార్టీ 42% బీసీ రిజర్వేషన్ కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఐతే ప్రజల్లో పాజిటివ్ మూడ్ నీ తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళాలని పీసీసీ, సర్కార్ భావించిందటా..! ఇందులో భాగంగానే పార్టీ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ వారిగా గెలిచిన, ఓడినా, అలాగే ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. అలాగే నియోజకవర్గాల వారిగా సమావేశం నిర్వహించారు. దాంతో పాటు అక్కడ ఉన్న సమస్యలు, విబేధాలా గురించి ఆరా తీశారు. దీంతో పాటు పథకాల ప్రచారం ఎలా జరుగుతుందని, ప్రభుత్వం పట్ల ఎలాంటి ఆలోచనతో ఉన్నారని అడిగి తెలియసుకున్నారు.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల పై జూమ్ మీటింగ్ కూడా నిర్వహించారు.
అందరి అభిప్రాయం తర్వాత పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి రెడీ అయింది. ముఖ్యంగా సన్నాబియ్యం పథకం ప్రజల్లో చాలా పాజిటివ్ గా వెళ్ళింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రధానంగా ఇటీవలే 3నెలల బియ్యం ఒక్కేసారి ఇస్తుండడంతో ప్రజల్లో కొంత పాజిటివ్ వచ్చింది. ఇదిలా ఉంటే రేషన్ కార్డు లో ఎన్నో ఏళ్ల నుండి కొత్త పేర్లు ఎక్కడలేదు. ఇంట్లో కొడుకు, కోడలు, మనవడు, మానవరాళ్లు పేర్లు ఎక్కడం… కొత్త రేషన్ కార్డు లు రావడం.. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు ప్రక్రియ మొదలు కావడంతో ప్రజలు ప్రభుత్వం పై చాలా పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ సర్వే లో సైతం ఇదే వచ్చింది.
వీటన్నిటితో పాటు రైతులు కూడా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వడంతో పాటు.. రైతు భరోసా పైసలు కూడా రైతుల ఖాతాలో పడుతున్నాయి. మొత్తం 9 రోజులో దాదాపు 9వేల కోట్లు రోజువారీగా పడుతూ వస్తున్నాయి. గ్రామాల్లో రైతుల పాత్ర కీలకం ప్రస్తుతం వారు హ్యాపీగా ఉన్నట్లే అని సర్కార్ భావిస్తుంది. వీటితో పాటు సర్కార్ అమలు చేసిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, డైట్ ఛార్జ్ లు పెంచడం, ఇంటిగ్రాటెడ్ స్కూల్స్, ఉద్యోగాలు ఇవ్వడం.. ఇలా సర్కార్ చేసిన పనులని చెప్పుకుంటూ ఎన్నికలకు వెళ్ళాలని డిసైడ్ అయిన్నట్లు సమాచారం.
మరి పార్టీ, సర్కార్ భావిస్తున్నట్లు త్వరలోనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికలో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయా.. లేదా సర్కార్ కి ఏమైనా ప్రతిపక్షలు చెప్తున్నట్లు ఎదురుదెబ్బ తగులుతుందా.. అనేది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.