TG EAPCET 2025: టీజీ ఎప్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్
EAPCET Counselling Schedule: రాష్ట్రంలో బీటెక్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన ఎప్ సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఇవాళ మధ్యాహ్నం విడుదల చేశారు. పాత ఫీజుల ప్రకారమే కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. రేపటి నుంచే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్:
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్- జులై 28 నుంచి జులై 7 వరకు
సర్టిఫికెట్ వెరిఫికేషన్- జులై 1 నుంచి జులై 8 వరకు
వెబ్ ఆపన్ష్- జులై 6 నుంచి జులై 10 వరకు
ఆప్షన్స్ ఫ్రీజ్- జులై 10
ఫస్ట్ ఫేజ్ సీట్ కేటాయింపు- జులై 18
సీటు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు గడువు- జులై 18 నుంచి జులై 22 వరకు
సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్:
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఫస్ట్ ఫేజ్ లో స్లాట్ బుకింగ్ చేయనివారికి- జులై 25
సర్టిఫికెట్ వెరిఫికేషన్- జులై 26
వెబ్ ఆపన్ష్- జులై 26, 27
ఆప్షన్స్ ఫ్రీజ్- జులై 27
సెకండ్ ఫేజ్ సీట్ కేటాయింపు- జులై 30
సీటు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు గడువు- జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు
ఫిజికల్ రిపోర్టింగ్ కోసం- జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు
ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్:
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఫస్ట్, సెకండ్ ఫేజ్ లో స్లాట్ బుకింగ్ చేయనివారికి- ఆగస్టు 5
సర్టిఫికెట్ వెరిఫికేషన్- ఆగస్టు 6
వెబ్ ఆపన్ష్- ఆగస్టు 6, 7
ఆప్షన్స్ ఫ్రీజ్- ఆగస్టు 7
ఫైనల్ ఫేజ్ సీట్ కేటాయింపు- ఆగస్టు 10
సీటు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు గడువు- ఆగస్టు 10 నుంచి ఆగస్టు 12 వరకు
ఫిజికల్ రిపోర్టింగ్ కోసం- ఆగస్టు 11 నుంచి ఆగస్టు 13 వరకు