Last Updated:

MLC Kavitha On Ed Inquiry: మొబైల్ ఫోన్లతో మూడోసారి విచారణకు కవిత.. విక్టరీ సింబల్ చూపిస్తూ

దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిరిగి మంగళవారం విచారణ కు హాజరయ్యారు.

MLC Kavitha On Ed Inquiry: మొబైల్ ఫోన్లతో మూడోసారి విచారణకు కవిత.. విక్టరీ సింబల్ చూపిస్తూ

MLC Kavitha On Ed Inquiry: దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిరిగి మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఆ కేసుకు సంబంధించి తొలిసారిగా మార్చి 11 న కవితను విచారించిన ఈడీ అధికారులు, రెండోసారి సోమవారం ( మార్చి 20) సుదీర్ఘంగా 11 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత మూడోసారి ఈడీ ముందు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె వెంట భర్త అనిల్ ఉన్నారు. ఈరోజు తన 10 ఫోన్లను ఈడీ అధికారులకు కవిత అందజేయనున్నారు. అంతకుముందు ఇంటి నుంచి బయటకు వచ్చిన కవిత తన ఫోన్లను మీడియాకు చూపించారు. విక్టరీ సింబల్ చూపిస్తూ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. అనంతరం తన లాయర్లతో కలిసి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు.

ఈడీ డైరెక్టర్ కు కవిత లేఖ (MLC Kavitha On Ed Inquiry)

మరో వైపు లిక్కర్ స్కామ్ కేసులో తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ‘ఈడీ చేస్తున్న తప్పుడు ఆరోపణలకు సమాధానంగా నేను వాడిన ఫోన్లను అందజేస్తున్నాను. ఒక మహిళగా తన ప్రైవసీని కూడా కాదని ఫోన్లను అందజేస్తున్నాను.’ అని కవిత లేఖలో పేర్కొన్నారు. కుట్రలో భాగంగానే దర్యాప్తు సంస్థ తనపై ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కనీసం సమన్లు ఇవ్వకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు ఈడీ ఆరోపణలు చేసిందని ప్రశ్నించారు. మార్చినెలలో తొలిసారి విచారణ కోసం ఈడీ పిలిచిందని… కానీ గత ఏడాది నవంబర్ లోనే తాను ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఈడీ అధికారులు ఆరోపించడం.. ఉద్ధేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే కదా అని లేఖలో కవిత తెలిపారు.

 

 

Untitled-9.jpg

 

14 ప్రశ్నలతో 10 గంటల విచారణ(MLC Kavitha On Ed Inquiry)

కాగా, సోమవారం జరిగిన విచారణలో లిక్కర్ కుంభకోణంలోని పలు అంశాలపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సౌత్ గ్రూప్ లావాదేవీలు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో హైదరాబాద్, ఢిల్లీ హోటళ్లలో సమావేశమయ్యారనే ఆరోపణలపై ప్రశ్నించినట్టు సమాచారం. కవితను మొత్తం 14 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. తనకు ఢిల్లీ మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేదని, ఇది రాజకీయ కుట్రలో భాగమే అని ఆమె అధికారులతో చెప్పినట్టు సమాచారం.