Last Updated:

Nandamuri Balakrishna : మరోసారి మంచిమనసు చాటుకున్న బాలయ్య.. తారకరత్న పేరుతో గుండె సమస్యలకు ఉచిత వైద్యం

నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సామాన్య ప్రజలను సైతం శోకంలో మునిగిపోయారు. 23 రోజులు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. అయితే తారకరత్నకు బాబాయ్ బాలయ్యతో అనుబంధం ఎక్కువ. తన ప్రతి కష్టంలోనూ బాలయ్యనే అండగా ఉన్నారు.

Nandamuri Balakrishna : మరోసారి మంచిమనసు చాటుకున్న బాలయ్య.. తారకరత్న పేరుతో గుండె సమస్యలకు ఉచిత వైద్యం

Nandamuri Balakrishna : నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సామాన్య ప్రజలను సైతం శోకంలో మునిగిపోయారు. 23 రోజులు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. అయితే తారకరత్నకు బాబాయ్ బాలయ్యతో అనుబంధం ఎక్కువ. తన ప్రతి కష్టంలోనూ బాలయ్యనే అండగా ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తనే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అయినప్పటికీ తారకరత్నను దక్కించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే అతని జ్ఞాపకార్థంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు.

బసవతారకం హాస్పిటల్ లో తారకరత్న బ్లాక్ ఏర్పాటు చేసిన బాలకృష్ణ (Nandamuri Balakrishna)..

బాలయ్య నటుడిగానే కాక ‘బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్’కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ హాస్పిటల్‌లోని ఒక బ్లాక్‌‌‌ పేరును ‘తారకరత్న బ్లాక్’గా మార్చారట. అంతేకాదు హృద్రోగ సమస్యలతో బాధపడే రోగులకు ఇక్కడ ఉచిత వైద్య సేవలు కల్పించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ నెట్టింట వైరల్ కాగా.. బాలయ్య మంచి మనసును నెటిజన్లు, ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ‘మా బాలయ్య బంగారం’ అంటూ పొగిడేస్తున్నారు.

అలాగే బాబాయ్‌ సిగ్నేచర్‌ను ఒంటిపై టాటూగా వేయించుకున్నారు తారకరత్న. పైన సింహం బొమ్మ.. దిగువన బాలయ్య సిగ్నేచర్ ఉన్న టాటూ ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతేకాదు.. బాలయ్య ఎలాగైతే నాన్నగారి పేరును స్మరిస్తారో.. అలానే తారకరత్న బాల బాబాయ్.. బాల బాబాయ్ నిత్యం పరితపించేవారని ఆయనతో దగ్గరిగా మెలిగిన సన్నిహితులు చెబుతున్నారు. నందమూరి బాలకృష్ణ ఇప్పుడు నటిస్తున్న అనిల్‌ రావిపూడి సినిమాలో విలన్‌గా నటించడానికి అంగీకరించారు తారకరత్న.

ఇక బాలయ్య ప్రొఫెషనల్ లైఫ్ విషయానికొస్తే.. రీసెంట్‌గా ‘వీరసింహారెడ్డి’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 చిత్రంలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలంగాణ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కనుండగా.. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీ లీల బాలయ్య కూతురి పాత్ర పోషించనుందని టాక్ నడుస్తుంది. ఇన్నాళ్ళూ తనలోని కామెడీ యాంగిల్ ని మాత్రమే చూపించిన అనిల్ రావిపూడి.. ఈ సినిమాతో మాస్ ని కూడా పరిచయం చేస్తా అని చెబుతున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede)

ఇక మరోవైపు తారకరత్న ఈ లోకాన్ని వీడడం పట్ల తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యా రెడ్డి అయితే ఈ విషాదం నుంచి ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా వరుస పోస్ట్ లు చేస్తున్నారు. తాజాగా ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.మరోవైపు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మరోసారి బాలయ్య గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆమె స్పందిస్తూ… ‘నేను ఏమి చెప్పగలను. మీకు నా కృతజ్ఞలను ఎలా తెలియజేయగలను. మీ గురించి ఏది చెప్పినా తక్కువే అవుతుంది. బంగారు హృదయం కలిగిన గొప్ప వ్యక్తి అని చెప్పడం ఎంతమాత్రం ఆశ్చర్యకరం కాదు. మీకు ఎవరూ సాటి కాదు. మీరు ఒక స్నేహితుడు, తండ్రి కంటే ఎక్కువ. ఇప్పుడు మీలో దేవుడిని చూసుకుంటున్నాను. మీ మంచితనాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. నా హృదయాంతరాల్లో నుంచి మీకు ధన్యవాదాలు చెపుతున్నాను. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో.. అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. జై బాలయ్య’ అంటూ ఎంతో భావోద్వేగంగా ఆమె స్పందించారు. అఖండ సినిమాలో అఘోరా రూపంలో ఉన్న బాలయ్య ఫొటోను షేర్ చేశారు.