Home / Asaduddin Owaisi
ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఆయన పాలస్తీనా అనుకూల నినాదాలు చేయడంతో దుమారం రేగింది. బీజేపీకి చెందిన శోభా కరంద్లాజె అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ప్రిసైడింగ్ అధికారి రాధామోహన్ సింగ్ దానిని రికార్డు నుండి తొలగించాలని ఆదేశించారు.
బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి మధ్య మాటల యుద్ధం ముగిసేట్లు కనిపించడం లేదు. కాగా శనివారం నాడు నవనీత్ రాణా మరోమారు ఓవైసీని ఉద్దేశించి కొత్త వీడియోను విడుదల చేశారు. దేశంలోని ప్రతి గల్లిలో రామభక్తులు తిరుగుతున్నారని గుర్తు చేశారు
హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. ఎంఐఎంకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో బీజేపీ కె మాధవీలతను బరిలో నిలిపింది. హైదరాబాద్లోని అతి పెద్ద ఆస్పత్రి విరంచికి ఆమె డైరెక్టర్.. తన ఎన్నికల అఫిడవిట్లో ఆమె ఆస్తి రూ.221 కోట్లుగా ప్రకటించారు. కాగా ఆమె పాత బస్తీలోని పేద మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారికి ఉచితంగా వైద్య సేవలందించారు
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామన్న ఆ పార్టీ వ్యాఖ్యలపై ఆలిండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇది విభజన రాజకీయాలకు అద్దంపడుతోందన్నారు.
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనను ప్రధాని నరేంద్ర మోదీకి మిత్రుడంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్లో జరిగిన ఓ సభలో ఓవైసీ మాట్లాడుతూ రాహుల్కు ప్రాణంగా ప్రేమించే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, ఒకరు ఇటలీ, రెండో వ్యక్తి మోదీ అని అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మజ్లిస్ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ బలం నీకు తెలియదు మా బలాన్ని గుర్తించి మీ నానమ్మ ఇందిరాగాంధీ దారుసలాంకు వచ్చిందన్నారు. ఈ గడ్డం టోపీదారులే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు
హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ఓవైసీ నోరు అదుపులోకి పెట్టుకోకుంటే పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీపై మూకదాడి జరగడం ఖాయమని హెచ్చరించారు. నీకు దమ్ముంటే నా నియోజకవర్గం గోషా మహల్నుంచి పోటీ చేయి అని ఓవైసీకి రాజాసింగ్ సవాల్ విసిరారు.
చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. తెలంగాణలోని పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేపడతామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలప్రచారానికి వెళ్లిన ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కు షాక్ తగిలింది. ఆయన ప్రచారసభలో ముస్లిం యువకులు ఆయన వ్యతిరేకంగా గో బ్యాక్ నినాదాలు చేసారు.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై దాడి చేసిన తరహాలోనే గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో అదే ఓవైసీపై గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పై రాళ్ల దాడి చేశారు.