Last Updated:

Harish Rao : త్యాగాల చరిత్ర మాది.. ద్రోహ చరిత్ర కాంగ్రెస్ పార్టీది.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao : త్యాగాల చరిత్ర మాది.. ద్రోహ చరిత్ర కాంగ్రెస్ పార్టీది.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao : ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ కోరుకున్నారని, అందుకే ఇవాళ శాసనసభలో ముఖ్యమంత్రి స్పీచ్‌ను బహిష్కరించామన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించి మాట్లాడారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్సే అని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్లే 299 టీఎంసీల నీటి పంపకాలు చేశారని, 299 టీఎంసీల నీటి వినియోగం కంటే ఎక్కువ ప్రాజెక్టులు లేవని, రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టలేనందునే 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారన్నారు. ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్ పారీదేనని విమర్శించారు. న్యూఢిల్లీలో రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ అనిల్ వెళ్లి ఎందుకు ఒప్పుకొని వచ్చారని నిలదీశారు. పోతిరెడ్డిపాడు కోసం పీజేఆర్ కొట్లాడితే ఉత్తమ్ పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు.

 

 

ద్రోహ చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది..
నాడు పొతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్క రోజు కూడా వ్యతిరేకించలేదని ఆరోపించారు. తాము 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేశామన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవులు త్యాగం చేశామని, ఉత్తమ్ కుమార్‌రెడ్డి చంద్రబాబు వద్దకు వెళ్లి భోజనం చేసి వచ్చి కృష్ణానీటిలో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. శ్రీశైలం ఖాళీ చేసేలా ఉత్తమ్ కుమార్‌రెడ్డి ద్రోహం చేశారన్నారు. ద్రోహ చరిత్ర ఉత్తమ్‌ది అయితే త్యాగ చరిత్ర బీఆర్ఎస్‌ది అన్నారు. కేసీఆర్ సెక్షన్ 3ని సాధించారన్నారు. దాని ద్వారా 573 టీఎంసీల నీళ్లు తెచ్చారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్టే తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తుచేశారు. నల్లగొండలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు కట్టడం వల్లే ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇవ్వగలిగామన్నారు. గతంలో హుజూర్‌నగర్‌ను ముంపునకు గురిచేసి ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చారని, తాము పులిచింతల నిర్వాసితులకు వందల కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడుకున్నామన్నారు.

ఇవి కూడా చదవండి: