Last Updated:

Bathukamma Sarees: ఈ నెల 25 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ మొదలుపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Bathukamma Sarees: ఈ నెల 25 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

Hyderabad: ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ మొదలుపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25 నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్దమయ్యారు.

సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ నుంచి వచ్చిన 240 డిజైన్‌ చీరలను ఆడపడుచులకు అందించనున్నారు. ఈనెల 25 నుంచి పంపిణీ ప్రారంభించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 30 సర్కిళ్లలోని 150 డివిజన్లలో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ద్వారా పంపిణీ జరుగుతుంది.

624 రేషన్‌ షాపుల్లో 8 లక్షల 94 వేల 871 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. 9 లక్షల 2 వేల 84 చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సంవత్సరం 5 లక్షల 76 వేల 161 చీరలను పంపిణీ చేశారు. ఈ మేరకు గౌడౌన్ల నుంచి ఆయా సర్కిల్‌ల్లో పంపిణీ చేయనున్న ప్రాంతాలకు ఈ చీరలను తరలిస్తున్నారు. తెల్లరేషన్‌కార్డు ఉండి, 18 సంవత్సరాలు పూర్తి అయిన మహిళలకు వీటిని పంపిణీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి: