Published On:

Renu Desai: హెచ్‌సీయూ‌ను వదిలేయాలని సీఎం రేవంత్‌కు రేణు దేశాయ్ రిక్వెస్ట్?

Renu Desai: హెచ్‌సీయూ‌ను వదిలేయాలని సీఎం రేవంత్‌కు రేణు దేశాయ్ రిక్వెస్ట్?

Renu Desai request to CM Revanth Reddy to HCU incident: హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూములపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ భూములు హెచ్‌సీయూకి చెందినవ అని, ఈ భూములను వేలం వేయవద్దంటూ విద్యార్థులు రెండు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. అయితే విద్యార్థులు ప్రతపక్షాలు బీఆర్ఎస్, బీజీపీతో పాటు బీజేవైఎం, సీపీఎం, ఇతర సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు.

 

తాజాగా, ఈ విషయంపై నటి రేణుదేశాయ్ స్పందించారు. హెచ్‌సీయూలోని 400 ఎకరాల భూమికి సంబంధించి వివాదంపై ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. ‘సీఎం రేవంత్ రెడ్డి.. ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మన పిల్లలకి ఆక్సిజన్ కావాలి, భవిష్యత్తు తరాల కోసం ఈ 400 ఎకరాల భూమిని వదిలేయండి.. ఇంకెక్కడైనా ల్యాండ్ చూసుకొని డెవలప్‌మెంట్ చేయండి’ అని రిక్వెస్ట్ చేసింది. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. ఆ భూమిని అలాగే వదిలేయాలని సీఎం రేవంత్‌ను కోరారు.

 

తనకు ప్రస్తుతం 44 ఏళ్లు అని, త్వరలోనే రేపో మాపో చనిపోతానని వెల్లడించారు. అయితే తర్వాతి తరాలకు ఆక్సిజన్, నీరు కోసం ఇలాంటి భూమి అవసరమని గుర్తు చేశారు. అభివృద్ధి కూడా జరగాలని, కానీ అందుకోసం మరోచోట భూమిని ఉపయోగించుకోవాలని ఆ వీడియోలో రేణు దేశాయ్ కోరారు.