Nadendla Manohar: రైతులను కులాల వారిగా విడగోట్టిన పార్టీ వైసీపీ.. నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని జనసేన పొలిటికల్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారువిభజించి పాలించు అనే సూత్రంతో వైసీపీ ముందుకు వెళుతోందని విమర్శించారు. రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు.
Andhra Pradesh: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని జనసేన పొలిటికల్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారువిభజించి పాలించు అనే సూత్రంతో వైసీపీ ముందుకు వెళుతోందని విమర్శించారు. రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ కడప జిల్లా పర్యటలో భాగంగా ఆయన అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బటన్ నొక్కితే బ్రహ్మండంగా సంక్షేమం జరిగిపోతోందంటున్నారు సీఎం, ఇంత సంక్షేమం చేసే ప్రభుత్వం దేశంలో లేదంటూ గొప్పలు పోతున్నారని ఎద్దేవా చేసారు. అంతా బాగుంటే ఇంత మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారని నాదెండ్ల ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే కరోనా నెపంతో సమాచారం దాచారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధకరమని అన్నారు. వీరికి సాయం అందించేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా జనసేన ముందుకు వచ్చిందని అన్నారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 175 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం దారుణమన్నారు. దేశంలో రైతులను కులాల వారిగా విడగోట్టిన పార్టీ వైసీపీ అని మనోహర్ ఆరోపించారు. సీఎం సొంత జిల్లాలో వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోతే నేటికీ పశువులకు దాణా లేదు. నిర్వాసితులకు ఇళ్లు కట్టించిన పాపాన పోలేదు. భూములు ఇసుక మేటల వేశాయి. ఓట్ల కోసం రాజకీయాలు చేయడం తగదన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలను చూసి ఆశీర్వదించాలని మనోహర్ కోరారు.