Last Updated:

kanana Lakshminarayana : జనసేనలోకి కన్నా లక్ష్మీనారాయణ .. కన్ ఫర్మ్ అయినట్లేనా ?

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరడానికి రంగం సిద్దమయింది.ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో విభేదాల నేపథ్యంలో ఆయన బీజేపీని వీడి జనసేన గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.

kanana Lakshminarayana :  జనసేనలోకి కన్నా లక్ష్మీనారాయణ .. కన్ ఫర్మ్ అయినట్లేనా ?

kanana Lakshminarayana  : ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరడానికి రంగం సిద్దమయింది.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో విభేదాల నేపథ్యంలో ఆయన బీజేపీని వీడి జనసేన గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.

జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజు కన్నాజనసేనలో చేరడం ఖాయమని సమాచారం.

కన్నా లక్ష్మీనారాయణ ను కలిసిన నాదెండ్ల మనోహర్

గత నెలలో  జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కన్నాను ఆయన ఇంటికి వెళ్లి కలవడంతో.. కన్నా జనసేనలోకి వెడతారని ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే తాను బీజేపీలో ఉంటానని కన్నా ప్రకటించారు.ఏపీలో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని టీడీపీ, జనసేన ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చేసాయి.

మరోవైపు బీజేపీ నేతలు మాత్రం తాము జనసేనతో ఉంటాము కాని టీడీపీ తో మాత్రం జతకట్టమని స్పష్టం చేసారు.

ఈ నేపధ్యంలో పార్టీ మారడమే మంచిదని కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

సోము వీర్రాజుతో విబేధాలు..

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో కన్నా లక్ష్మీనారాయణ చాలా రోజులనుంచి విబేధిస్తున్నారు.

ఏపీలో జగన్ సర్కార్ పై బీజేపీ రాష్ట్రశాఖ సరైన విధంగా పోరాటం చేయలేదని ఆయన భావిస్తున్నారు.

టీడీపీ విషయంలో కూడ బీజేపీ విధానం ఆయనకు నచ్చలేదు.

సోము నాయకత్వంలో బీజేపీ బలపడటం లేదన్నది ఆయన ఆరోపణ.

మరోవైపు తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నపుడు నియమించిన జిల్లా అధ్యక్షులను

సోము వీర్రాజు మార్చడంపై కూడా ఆయన మండిపడ్డారు.

బీజేపీలో ఉంటే తనకు ఏ మాత్రం ప్రాధాన్యం ఉండదని గ్రహించిన కన్నా జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు

 

సత్తెనపల్లి టిక్కెట్టు అడుగుతున్న కన్నా లక్ష్మీనారాయణ ?..

కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు టిక్కెట్ ను కేటాయించేందుకు జనసేన నాయకత్వం కూడా అంగీకరించిందని భోగట్టా.

సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూర పశ్చిమ నియోజకవర్గాల్లో మంచి పట్టున్న

కన్నా చేరిక తమకు ప్లస్ అవుతుందని జనసేన భావిస్తోంది.

దీనితో ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కన్నా జనసేనలో చేరడం అవాస్తవం.. బీజేపీ

బీజేపీ నుంచి జనసేనలోకి కన్నా లక్ష్మీనారాయణ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ స్పందించింది.

కన్నా బీజేపీని వీడి జనసేనలోకి చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నేత తురగా నాగభూషణం ఖండించారు.

ఈరోజు వివిధ ఛానెల్స్, వివిధ మాధ్యమాల్లో కన్నా గారిపై వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన అన్నారు.

అయన వ్యక్తిగత కార్యక్రమాల దృష్ట్యా హైదరాబాద్ లో ఉన్నారన్నారు.

కన్నా ఎక్కడ ఉన్నా గౌరవిస్తాను.. పవన్ కళ్యాణ్

మరోవైపు  ఈ విషయంపై  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.
కన్నా ఎక్కడ ఉన్నా గౌరవిస్తానన్నారు.
ప్రస్తుతం కన్నా బీజేపీలో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేనన్నారు.

ముగ్గురు సీఎం ల   క్యాబినెట్లో కన్నా లక్ష్మీనారాయణ..

కన్నా లక్ష్మీ నారాయణ నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గాల్లో క్రింది విభాగాలలో సహాయమంత్రిగా పనిచేసారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో క్యాబినెట్ మంత్రిగా వ్యవహరించారు.
ఆయన భారీ పరిశ్రమలు, వాణిజ్యం, కార్మికశాఖ, వ్యవసాయం, రవాణా, సహకారం వంటి కీలకశాఖలను నిర్వహించారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/