Last Updated:

Viveka Murder Case: సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో వివేక కుమార్తె అన్నీ నిజాలే చెప్పింది..

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీతా రెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం రేపటిదినం విచారణ చేయనుంది. ఈ నేపధ్యంలో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

Viveka Murder Case: సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో వివేక కుమార్తె అన్నీ నిజాలే చెప్పింది..

Andhra Pradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీతా రెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం రేపటిదినం విచారణ చేయనుంది. ఈ నేపధ్యంలో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

కేసును నీరుగార్చేందుకు ఏపీ పోలీసులు, ఏపి ప్రభుత్వం అని పిటిషన్ లో పేర్కొన్న మేర అన్నీ నిజాలేనని సిబీఐ పేర్కొనింది. కేసును విచారిస్తున్న విచారణాధికారి పైనే నిందితులు కేసులు పెట్టారు. సీబీఐ తనపై వత్తిడి తెచ్చి 164 స్టేట్మెంట్ అడిగారని అధికారి శంకరయ్య లేఖ రాశారు. అనంతరం ఆయనకు పదోన్నతి కల్పించారు. రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని సీబీఐ తన అఫిడవిట్ లో పేర్కొనింది. ఉద్ధేశపూర్వకంగానే కేసు విచారణ జాప్యం చోటుచేసుకొంటుంది. నిందితులు చెప్పిన విధంగానే స్థానిక పోలీసులు వ్యవహరించారని సీబీఐ పేర్కొనింది.

తన నాన్న హత్య కేసు విచారణ సాఫీగా సాగడంలేదంటూ వైఎస్ సునీతా రెడ్డి కోర్టులో పదే పదే తన న్యాయవాది ద్వారా పేర్కొనివున్నారు. ఈ క్రమంలోనే ఆమె మరో రాష్ట్రానికి కేసును బదిలీ చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వివరణ కోరిన సుప్రీం కోర్టు సీబీఐ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రేపటిదినం ధర్మాసనం కేసును విచారించనుంది.

ఇది కూడా చదవండి: Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఎంపీ మాగుంట కుమారుడిని ప్రశ్నిస్తున్న సీబీఐ

ఇవి కూడా చదవండి: