Last Updated:

AP DSC: గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి బొత్స.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

AP DSC: ఏపీ నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్ష నిర్వహించారు.

AP DSC: గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి బొత్స.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

AP DSC: ఏపీ నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్ష నిర్వహించారు. తర్వలోనే ఉద్యోగుల బదిలీలపై నిర్ణయం తీసుకుంటామనిస స్పష్టం చేశారు. బదిలీల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్.. (AP DSC)

ఏపీ నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్ష నిర్వహించారు. తర్వలోనే ఉద్యోగుల బదిలీలపై నిర్ణయం తీసుకుంటామనిస స్పష్టం చేశారు. బదిలీల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.

డీఎస్సీ నోటిఫికేషన్ పై సీఎం వైఎస్ జగన్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారు. ఈ మేరకు బొత్స విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. త్వరలో కచ్చితంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలపై త్వరలోనే ప్రకటన చేస్తామని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల బదిలీల విషయంలో.. ఇతర రాష్ట్రాల అంశాలను పరిశీలిస్తున్నామని మంత్రి అన్నారు.

మీడియా సమావేశంలో రాజధాని అంశంపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అనేదే తమ పాలసీ అని స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని డైవెర్షన్ చెయ్యాల్సిన అవసరం తమకు లేదన్నారు.

అమరావతే రాజధాని అయితే చంద్రబాబు హైదరాబాద్ లో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొందరు మాట్లాడారని తెలిపారు. బిడ్డింగ్ తో ఆ విషయం స్పష్టమయిందని చెప్పారు.

తాము చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం అధీనంలోనే ఉండాలని చెబుతున్నామని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని చెప్పారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు మంచి నటుడు, మ్యానిపులేటర్ అని విమర్శించారు.

కాంట్రాక్టు ఉద్యోగుల అంశాన్ని పరిశీలిస్తన్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారని అన్నారు.

విద్యార్థులకు రాగి జావా నిలిపివేశామన్న ప్రచారం తప్పని చెప్పారు. పరీక్షలు, ఒంటిపూట బడుల కారణంగా చిక్కీలు ఇస్తున్నామని తెలిపారు.