Navodaya Results 2025: నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఫలితాలు చూసుకోండిలా!

JNVST Class 6th, 9th Results 2025 Declared: విద్యార్థులకు గుడ్ న్యూస్. దేశ వ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి, 9వ తరగతి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ సమితి జనవరి 18వ తేదీన 6వ తరగతికి పరీక్ష జరగగా.. ఫిబ్రవరి 8వ తేదీన 9 వ తరగతికి నవోదయ పరీక్ష నిర్వహించారు. తాజాగా, ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను జేఎన్‌వీఎస్‌టీ విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల వివరాలను తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inలో చెక్ చేసుకోవాలని సూచించింది. విద్యార్థులు అడ్మిట్ కార్డులో ఉన్న విధంగా రోల్ నంబర్‌తో పాటు డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని తెలిపింది.
కాగా, ఎంపికైన విద్యార్థులు సంబంధిత నవోదయ విద్యాలయంలో అవసరమైన సర్టిఫికెట్స్ అందించాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న జిల్లాలో ఉన్న నవోదయ విద్యాలయంలో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు ముందుగా nvs అధికారిక వెబ్ సైట్ వెళ్లి navodaya.gov.in లేదా cbseit.inకు వెళ్లాలి. ఆ తర్వాత ఫలితం 2024 లింగ్ క్లిక్ చేయాలి. మరో పేజీ ఓపెన్ అయిన వెంటనే రోల్ నంబర్, బర్త్ డే వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. వివరాలు నమోదు చేయగానే నవోదయ 6వ తరగతి అండ్ 9వ తరగతి ఫలితాలు కనిపిస్తాయి. వీటిని సేవ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
అలాగే, అడ్మిషన్ కోసం పలు రకాల సర్టిఫికెట్స్ జత చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా నివాస ధృవీకరణ పత్రం, nvs షరతుల ప్రకారం అర్హత సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రంతో పాటు ప్రత్యేక సామర్థ్యం ఉన్న అభ్యర్థికి వైకల్య ధృవీకరణ పత్రాలు జత చేయాలి. ఇదిలా ఉండగా, నవోదయ విద్యాలయాల్లో సంబంధిత జిల్లాల్లో ఖాళీల ఆధారంగా అడ్మిషన్ల కోసం రెండు వెయిటింగ్ లిస్టులు విడుదల చేస్తారు. ఒకవేళ చేరనివారితో పాటు సర్టిఫికెట్లు లేనివారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పించనున్నారు.