Last Updated:

Platform 65 : భారతీయ రైల్వే సిబ్బందికి బంపర్ ఆఫర్ ప్రకటించిన “ప్లాట్ ఫామ్ 65” రెస్టారెంట్..

భారతదేశంలోని అతిపెద్ద టాయ్-ట్రైన్-నేపథ్య రెస్టారెంట్ అయిన ప్లాట్‌ఫామ్ 65.. భారతీయ రైల్వే ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు రైల్వే ఉద్యోగులకు ప్రత్యేకంగా 18% ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. రైల్వే నెట్‌వర్క్‌ కు.. వారి అమూల్యమైన సహకారానికి ప్రశంసా చిహ్నంగా, ప్లాట్‌ఫాం 65 ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

Platform 65 : భారతీయ రైల్వే సిబ్బందికి బంపర్ ఆఫర్ ప్రకటించిన “ప్లాట్ ఫామ్ 65” రెస్టారెంట్..

Platform 65 : భారతదేశంలోని అతిపెద్ద టాయ్-ట్రైన్-నేపథ్య రెస్టారెంట్ అయిన ప్లాట్‌ఫామ్ 65.. భారతీయ రైల్వే ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు రైల్వే ఉద్యోగులకు ప్రత్యేకంగా 18% ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. రైల్వే నెట్‌వర్క్‌ కు.. వారి అమూల్యమైన సహకారానికి ప్రశంసా చిహ్నంగా, ప్లాట్‌ఫాం 65 ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కాగా ఈ తగ్గింపును పొందేందుకు, రైల్వే ఉద్యోగులు బిల్లింగ్ సమయంలో రెస్టారెంట్‌లో తమ రైల్వే ఉద్యోగి ఐడీ కార్డును చూపించాలి.

ఈ సందర్భంగా, ప్లాట్‌ఫామ్ 65 మేనేజింగ్ డైరెక్టర్, వ్యవస్థాపకులు సద్గుణ్ పథ మాట్లాడుతూ, “ఈ ప్రత్యేక ఆఫర్‌ను మన నగరంలోని అంకితమైన రైల్వే ఉద్యోగులకు విస్తరించడానికి నేను నిజంగా సంతోషి స్తున్నాను. మన స్థానిక రైల్వే నెట్‌వర్క్‌ ను సజావుగా నడిపించడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు. వారికి ఈ ప్రత్యేక తగ్గింపును అందించడం ద్వారా మా మద్దతును తెలియజేయడం మాకు గౌరవంగా ఉంది. వారు ప్లాట్‌ఫామ్ 65లో మాతో చేరి, ప్లాట్‌ఫామ్ 65 అవుట్‌ లెట్‌లలో మా ఆహ్లాదకరమైన మెనూ ఆఫర్‌లను ఆ స్వాదిస్తూ విలక్షణమైన రైలు నేపథ్య వాతావరణాన్ని ఆస్వాదిస్తారని మేం ఆశిస్తున్నాం”’’ అని అన్నారు.

Menu

“మన స్థానిక రైల్వే ఉద్యోగుల కృషిని గుర్తించడం, అభినందించడం చాలా అవసరం. ఈ తగ్గింపు మా కృత జ్ఞతకు ఒక చిన్న గుర్తు. ఇది వారికి ఆనందాన్ని కలిగిస్తుందని, మా అసాధారణమైన వంటకాలు, సంపూర్ణ అనుభూతి చెందే రైలు నేపథ్య వాతావరణాన్ని అనుభవించడానికి ప్లాట్‌ఫామ్ 65ని సందర్శించా ల్సిందిగా వారిని ప్రోత్సహిస్తుందని మేం ఆశిస్తున్నాం” అని ప్లాట్ ఫామ్ 65 వైస్ ప్రెసిడెంట్ శ్రీ వెంకటేష్ తెలిపారు.

భారతీయ రైల్వే వ్యవస్థ, దాని రైళ్ల నుండి ప్రేరణ పొందిన ప్లాట్‌ఫామ్ 65, ప్రత్యేకమైన, సంపూర్ణ అనుభూతి పొందే భోజన అనుభవాన్ని సృష్టించడానికి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటుంది. ప్లాట్‌ఫామ్ 65లో, కస్టమర్‌లు నిపుణులైన చెఫ్‌ల ప్రత్యక్ష, క్లిష్టమైన పర్యవేక్షణలో తయారుచేయబడిన నోరూరించే వంటకాలను ఆనంది స్తారు. రైల్వే ఉద్యోగుల కోసం ఈ ప్రత్యేక ఆఫర్‌తో, ప్లాట్‌ఫామ్ 65 స్థానిక రైల్వే సంఘంతో తన అనుబంధా న్ని బలోపేతం చేయడం, వారి సేవకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకుంది అని వివరించారు.