Illegal Mining Districts: అధికారం మనదే.. గుట్టుగా తవ్వేసి.. అమ్మేద్దాం..!

Illegal Mining Districts: భూమి లోపలి నుంచి పొందే ప్రతీది ఖనిజమే. భూమి నుంచి వచ్చే ఖనిజాలు మట్టి, ఇసుక, సున్నం, నాపరాయి, గ్రానైట్ రాయి, బొగ్గు, సహజ వాయువు చెప్పుకోవచ్చు. అయితే వీటిలో ఏ ఖనిజం వెలికి తీయాలన్న గనుల శాఖ పర్మిషన్ కంపల్సరీ. అయితే ఇప్పుడు ఆ జిల్లా నేతకు అవేమీ అవసరం లేదు. అధికారం అండతో ఇష్టమొచ్చినట్లు తవ్వుకోవచ్చు. విక్రయించుకోవచ్చు. కోట్ల రూపాయిలు సొమ్ము చేసుకోవచ్చు.ఇదీ ప్రస్తుతం ఆ జిల్లాలో మైనింగ్ వ్యవహారం.
ఏ ఖనిజం వెలికితీయాలన్నా.. గనుల శాఖ అనుమతి తప్పనిసరిగా కావాలి. అదే ఖనిజం తవ్వాలంటే సవాలక్ష పర్మిషన్లు కావాలి. అదే అధికారం మనదైతే.. ఏ శాఖ భూముల్లో ఉన్నా .. పర్మిషన్లు అక్కర్లేదు కూడా.ఎందుకు అంటే.. ఆ జిల్లాలో ఆ నేతకు అవేమీ అవసరం లేదు. అధికారం అండతో ఇష్టమొచ్చినట్లు తవ్వకోవచ్చు. అడ్డగోలు దోపిడీతో.. కోట్ల రూపాయలు కొల్లగొట్టొచ్చు. జిల్లా — మండలం –గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే పలుగురాయి తవ్వకం, శుద్ధి, తరలింపు జరిగిపోయిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండానే.. గుట్టుగా ఖనిజాన్ని తవ్వేస్తున్నారు. గుట్టుగా అమ్మేస్తున్నారు.
కొన్ని జిల్లాల్లో ఖనిజం నిల్వలు విస్తారంగా ఉన్నాయి. అక్కడ ఉన్న వేల ఎకరాల భూములపై ఆ ప్రాంత కీలక ప్రజాప్రతినిధి కన్ను పడింది. అధికారం అండతో చెలరేగిపోతున్నారు. ఆయన కనుసన్నల్లో భారీగా ఖనిజం ఉన్నంత మేర ఇష్టానుసారం తవ్వేశారు. ఆ ప్రజాప్రతినిధి కానీ, ఆయన మనుషులు కానీ ఖనిజం తవ్వేందుకు అనుమతులు తీసుకోవడం, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించడం వంటివేమీ లేకుండా… తవ్వకాలు చేపట్టారని స్థానికులు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారులు వర్షన్ ఏమిటి అంటే…
ఈ ప్రాంతంలో వందల ఎకరాల్లో నిల్వలున్నాయి. వాటిని మైనింగ్ శాఖ గతంలో.. ఎప్పుడు వేలం వేసిందో.. తెల్సుకుని రాయండి.. ఆ ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితులైన మిత్రులు.. ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాటిని వేరే వారి నుంచి దక్కించుకుంటే దక్కించుకన్నారని లేకపోతే ఆక్రమిస్తే ఆక్రమించారని రాయండి. పేరుకేమో అనుచరులు దోచేది ఏమో ఆ ప్రజాప్రతినిధే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం దోపిడీలో ఎక్కడా తన పేరు ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. కోట్ల రూపాయలకుపైగా విలువైన ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచేశారు.
అక్రమార్కులు ఎలాంటి లీజులు లేకుండా ప్రభుత్వ భూముల్లోని ఖనిజ నిక్షేపాలను తవ్వి తరలిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా ఖనిజ సంపదను రవాణా చేస్తున్నారు. మైనింగ్ మాఫియా ఖనిజ సంపద ద్వారా ఒక్కో గని నుంచి నెలకు లక్షల నుంచి కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. లీజులు లేని గనుల్లో తవ్వకాలు జరగకుండా నిరోధించాల్సిన గనుల శాఖ అధికారుల తీరుపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అనుమతి లేని గనుల్లో తవ్వకాలు జరపడంతోపాటు ఫారెస్ట్ భూములను సైతం వదలకుండా మైనింగ్ చేస్తూ అటవీ భూములను నాశనం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని లేకపోతే రాబోయే రోజుల్లో రాళ్ల గుట్టలు, పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపిన గనులు కనిపిస్తాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.